మేల్కొనే ఉన్నాం.. బాగా నిద్రపోండి’ IAF దాడికి ముందు పాక్ ఆర్మీ ట్వీట్

IAF సర్జికల్ దాడులు చేయడానికి కొన్ని గంటల ముందు పాకిస్థాన్ డిఫెన్స్ పెట్టిన ట్వీట్ ఇది. ‘‘మేం మేలుకొని ఉన్నాం. అంతా గాఢంగా నిద్రపోండి’’ అంటూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

భారత వైమానిక దళం (IAF) దాడి తర్వాత పాకిస్థాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ప్రపంచం దేశాల నుంచి మద్దతు లభించకపోగా.. అక్కడ జరిగిన దాడిపై ఎలా స్పందించాలో తెలియక గందరగోళానికి గురవ్వుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా పాక్ బాగా ట్రోల్ అవ్వుతోంది. ఈ నేపథ్యంలో IAF సర్జికల్ దాడికి కొన్ని గంటల ముందు పాకిస్థాన్ డిఫెన్స్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

ఫిబ్రవరి 25న పాకిస్థాన్ వైమానిక దళం (PAF)కు చెందిన యుద్ధ విమానం ఫొటోతో పాకిస్థాన్ డిఫెన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘PAF మెలకువగా ఉంది. మీరు ఆదమరిచి నిద్రపోండి’’ అని ట్వీట్ చేసింది.

ఆ ట్వీట్ పెట్టిన కొన్ని గంటల్లోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)తోపాటు పాకిస్థాన్‌ భూభాగంలోని బాలాకోట్‌పై కూడా

భారత వైమానిక దళం దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో అటు పాక్ ప్రజలు, ఇటు భారత నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మన నెటిజన్లు సెటైర్లు వేస్తుంటే.. పాక్ నెటిజన్లు వారిని తిట్టిపోస్తున్నారు.

భారత వైమానిక దళం దాడికి కొన్ని గంటల ముందు పాక్ ట్వీట్

మేల్కొని ఉన్నామని చెప్పి నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మీరు మేల్కొని ఉంటే భారత వాయు సేన పాక్‌లోకి చొరబడి ఎలా దాడి చేయగలిగిందంటూ పాక్ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *