రధసప్తమి వేళ ప్రత్యక్ష దైవానికి ప్రణామాలు*

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి.

సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత వేద పండితుల, వేద మంత్రోచ్ఛారణలతో మంగళవాయిద్యాలతో ఆదిత్యునికి మహా క్షీరాభిషేకం చేశారు.

అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు వేదపండితులు స్వామివారి మూలవిరాట్కు క్షీరాభిషేకం నిర్వహించారు.

ఏడాదికోసారి వచ్చే రథసప్తమి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

మహా శుద్ధ సప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సూర్యభగవానుని దర్శించుకోవడానికి భారీగా భక్తులు ఆలయానికి తరలి వచ్చారు.

ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించారు.

రథసప్తమి రోజున అరసవెల్లి భాస్కరుని పూజిస్తే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.

ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం మంగళవారం భక్తుల రద్దీతో నిండి పోయింది.

విశాఖ సాగరతీరంలో విశాఖ సాగరతీరంలో yoga సౌందర్యం తొణికిసలాడింది, సూర్య నమస్కారాలతో, యోగాసనాలతో ధీనకరుడికీ అంజలి ఘటించారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సూర్యనమస్కారాలు పూజలు చేశారు.

సింహాచలంలో సింహాద్రి అప్పన్న దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి ,సింహగిరిపై స్వామి గర్భ గుడి పక్కన ఉన్న రాతి రథం పై సింహాద్రి నాధుని ఉత్సవ విగ్రహాలను సూర్యభగవానుని అలంకారం చేసి విశేష పూజలు అభిషేకాలు జరిపారు.

దీనితోపాటు శ్రీ సింహాద్రి అప్పన్న గోశాలలో సుమారు పది అడుగుల సూర్యభగవానుని రాత్రి విగ్రహాన్ని రథసప్తమి సందర్భంగా ప్రారంభించారు.

అశ్వవాహనం తో ఉన్న స్వామి విగ్రహం 27 లక్షల వ్యయంతో దేవస్థానం ఏర్పాటు చేసింది.

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి, ఇందులో భాగంగా స్వామి వారు ఏడు వాహనాలపై ఊరేగారు, తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి చిన్న శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహన సేవలను తిలకించేందుకు భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *