60వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన భార్యను గుర్తు చేసుకున్నారు:గోవా సీఎం మనోహర్

గోవా సీఎం మనోహర్ పారికర్ భార్య కూడా క్యాన్సర్‌తోనే మరణించారు.
ఆయన సీఎం బాధ్యతలు చేపట్టడానికి కొద్ది నెలల ముందు ఆమె క్యాన్సర్‌తో చనిపోయారు.
60వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన భార్యను గుర్తు చేసుకున్నారు.

క్యాన్సర్ మిగిల్చిన విషాదం.. పారికర్ భార్య కూడా ఆ మహమ్మారికే బలి..

గోవా సీఎం మనోహర్ పారికర్ భార్య కూడా క్యాన్సర్‌తోనే మరణించారు. ఆయన సీఎం బాధ్యతలు చేపట్టడానికి కొద్ది నెలల ముందు ఆమె క్యాన్సర్‌తో చనిపోయారు. 60వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన భార్యను గుర్తు చేసుకున్నారు.

గోవా సీఎం మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాటంలో అలసిన ఆయన ఈ లోకాన్ని విడిచారు.

తుది శ్వాస వరకు గోవా సీఎంగానే ఉండాలని భావించిన ఆయన.. తనకు ఇష్టమైన పదవిలో ఉండగానే ప్రాణాలు వదిలారు. విషాదం ఏంటంటే..

2001లో ఆయన భార్య కూడా క్యాన్సర్ వ్యాధి కారణంగానే తనువు చాలించారు. 2000 సంవత్సరం అక్టోబర్లో ఆయన గోవా సీఎంగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు.

అంతకు ముందే 2000 మే నెలలో ఆయన భార్య మేధాను క్యాన్సర్ మహమ్మారి బలి తీసుకుంది. ఇప్పుడు పారికర్ కూడా క్యాన్సర్‌ కారణంగానే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.

మనోహర్, మేధా 1979 జూన్ 2న పెళ్లి చేసుకున్నారు. వీరికి ఉత్పల్, అభిజిత్ అనే ఇద్దరు పిల్లలున్నారు. వారి బాధ్యతలను చూసుకుంటూనే.. భార్య చనిపోయిన బాధను దిగమింగుకుంటూ.. ఆయన గోవా సీఎంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపారు.

40 ఏళ్ల వయసులోనే మేధా నన్ను వదిలి వెళ్లిపోయిందని తన 60వ పుట్టిన రోజు సందర్భంగా మనోహర్ పారికర్ తన భార్యను గుర్తు చేసుకున్నారు. ఆమె లేని లోటును గోవా ప్రజలు తెలియనీయలేదని పారికర్ చెప్పారు.

పారికర్ ఉత్తర గోవాలని పర్రా అనే గ్రామంలో 1955 డిసెంబర్ 13న జన్మించారు. గ్రామం పేరిటే ఆయన ఇంటి పేరైన పారికర్ అనే పేరొచ్చింది.

1978లో ఆయన ఐఐటీ బాంబే నుంచి బీటెక్ పూర్తి చేశారు. స్కూల్ వయసులోనే ఆర్ఎస్సెస్‌లో చేరిన ఆయన.. 1981లో ఆరెస్సెస్ సంఘచాలక్‌గా నియమితులయ్యారు.

1991లో ఉత్తర గోవా లోక్‌సభకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. 1994లో గోవా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లోనే గోవాలో బీజేపీ ఖాతా తెరిచింది.

1996లో మళ్లీ లోక్ సభకు పోటీ చేసి ఓడారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటి ఐఐటీ పూర్వ విద్యార్థి ఆయనే కావడం విశేషం.

2000 సంవత్సరంలో తొలిసారి గోవా సీఎం అయిన పారికర్ 2002 ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు వెళ్లారు. జూన్లో తిరిగి సీఎంగా ఎన్నికయ్యారు.

మొత్తం నాలుగు సార్లు ఆయన గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

2014లో ప్రధాని మోదీ ఆయన్ను ఏరికోరి మరీ రక్షణ మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు. పారికర్ యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గోవా ఎన్నికల అనంతరం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో.. ఆయన తిరిగి గోవా సీఎం అయ్యారు.

ఫిబ్రవరి 14, 2018న పారికర్ హాస్పిటల్ పాలయ్యారు. తొలుత ఆయనకు ఫుడ్ పాయిజన్ అయిందని భావించారు. మరుసటి రోజే ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేరారు. పారికర్ పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని గతేడాది అక్టోబర్ 27న గోవా ప్రభుత్వం ప్రకటించింది. ఆయన అమెరికాలోనూ, ఢిల్లీ ఎయిమ్స్‌లోనూ చికిత్స పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed