ఎన్టీఆర్ అభిమానులు Vs చరణ్ అభిమానులు: హీరో హీరోయిన్ సినిమా.

ఒకవైపు మా ఎన్టీఆర్ సినిమానే పైరసీ చేస్తావా అంటూ హీరో చొక్కా పట్టుకుంటారు అభిమానులు.

మరోవైపు వచ్చేవారం రామ్ చరణ్ సినిమా వస్తోంది.

ఇంతకంటే ఎక్కువ పైరసీ చేస్తా అంటాడు ఓ హీరో .

అంతే, వెంటనే తారక్ ఫ్యాన్స్ అంతా కలిసి అతడ్ని మెచ్చుకుంటారు. దగ్గరుండి అతడికి సిగరెట్ వెలిగించి మరీ వాళ్ల లోకి చేర్చుకుంటారు.

ఈ గొడవంతా ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ అయిన మూవీ టీజర్ క్లిప్పింగ్ కు సంబంధించిన గొడవలు ..హీరోహీరోయిన్ మూవీ టీజర్ లో వివాదాస్పదమైన ఈ క్లిప్పింగ్ పై హీరో నవీన్ చంద్ర స్పందించాడు.

ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ లో అలాంటివాళ్లు కూడా ఉంటారని ఈ హీరో కామెంట్ చేశాడు.”ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టడం మా ఉద్దేశం కాదు. అలాంటి వాళ్లు కూడా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం.

ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ప్రస్తుతం అభిమానుల మధ్య జరుగుతున్నదే చూపించాం. అందులో తప్పేముంది.”అంటూ వ్యాఖ్యానించారు

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి సినిమా చేస్తారనే విషయం మా యూనిట్ కు తెలియదని, ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టు సెట్ అవ్వడానికి ముందే మా సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని అంటున్నాడు నవీన్.

టీజర్ లో ఆ డైలాగ్ పెట్టడానికి కారణం యూట్యూబ్ అంటున్నాడు.

“అలాంటి ఫ్యాన్స్ ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో ఒక హీరో ట్రయిలర్ రిలీజైతే ఆపోజిట్ హీరో ఫ్యాన్స్ వచ్చి తిడుతున్నారు. కామెంట్స్ చూస్తే మీకే అర్థమౌతుంది.

ఫ్యాన్స్ ఎందుకిలా రియాక్ట్ అవుతున్నారనే ఆలోచన నుంచే ఆ సీన్ పుట్టింది.”

తన టీజర్ చూసి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో తనకు తెలియదంటున్నాడు నవీన్ చంద్ర చెప్పాడు.

కానీ తాము మాత్రం అవాస్తవాలు చెప్పలేదని, బయట జరుగుతున్న విషయాలనే చూపించామని మరోసారి తననుతాను సమర్థించుకున్నాడు నవీన్ చంద్ర.

మరి ఈ వివాదాస్పదమైన మూవీ ‘హీరో హీరోయిన్’ ఏపాటి సక్సెస్ ను దక్కించుకుందో వేచి చూడాల్సిందే మరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *