ఉత్తరాంధ్ర చర్చ వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జన ఘోష ఢిల్లీ రైలు యాత్ర

విశాఖలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకు తీసుకొచ్చేందుకు జన గోసపేరుతో ఢిల్లీకి రైలు యాత్రను చేపడుతున్న రామకృష్ణ.

ఏపీ సమస్యలపై కేంద్ర మంత్రులు, ఎంపీలకు వినతి పత్రాలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏపీ నేతలపై మోడీకి కోపం ఉంటే వేరే రకంగా చూడాలన్నారు.

కానీ ఏపీ ప్రజలకు అన్యాయం చేయకూడదని కొణతాల రామకృష్ణ సూచించారు. ఏపీ ప్రజల ధన కోసం వినిపించేందుకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకుంటూ జనవరి యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం 7:30 గంటలకు ఏపీ ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి బయలుదేరి నట్టు చెప్పారు.

ఈ యాత్రలో భాగంగా ఐదు రోజులు ఉత్తరాంధ్ర చర్చ వేదిక సభ్యులు నల్ల దుస్తులు ధరించి వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు.

ఢిల్లీ యాత్ర ముగిసిన తర్వాత తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు కొణతాల రామకృష్ణ ప్రకటించారు.

ఇప్పటికే పలు పార్టీలు చేరమంటూ ఆహ్వానిస్తున్న అన్నారు. తనమిత్రులు, సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *