10ఏళ్ల వయసున్న బాలికల నుంచి 80ఏళ్లు పైబడిన.. 40 మంది మహిళలపై అత్యాచారం..కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

40 మంది మహిళలపై అత్యాచారం.. ఏడేళ్లకు చిక్కిన సీరియల్ రేపిస్ట్
సుమారు 40 మంది మహిళలపై దారుణంగా అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతున్న కామాంధుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఘటన నైజీరియాలో వెలుగుచూసింది.
40కి పైగా రేప్ కేసులున్న వ్యక్తి మరో మహిళపై అత్యాచారానికి పాల్పడుతుండగా పోలీసులు పట్టుకున్నారు.
నైజీరియాలోని డాంగోరా పట్టణానికి చెందిన ఓ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి గదిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.
అప్పుడే ఇంటికి వచ్చిన యువతి తల్లి కేకలు విని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
కొద్ది క్షణాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
విచారణలో అతడు సుమారు 40 మంది మహిళలపై రేప్ చేసినట్లు తేలడంతో పోలీసులే అవాక్కయ్యారు.
10ఏళ్ల వయసున్న బాలికల నుంచి 80ఏళ్లు పైబడిన వృద్ధ మహిళలపైనా అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. సుమారు ఏడేళ్లుగా ప్రజలకు కంటికపై కునుకు లేకుండా చేస్తున్న సీరియల్ రేపిస్ట్ అరెస్ట్ కావడంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ కామాంధుడి చేతిలో బలైపోయిన మహిళలు పరువు పోతుందన్న భయంతోనే ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.
బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే వివరాలు గుట్టుగా ఉంచి దర్యా్ప్తు చేస్తామని చెబుతున్నారు.