ఇండియన్ 2 సినిమా నుంచి మరో న్యూ లుక్ ….

ఇండియన్-2 సినిమా నిన్నట్నుంచి మొదలైంది.

చెన్నై శివార్లలో వేసిన భారీ సెట్ లో ఈ సినిమాకు సంబంధించి కమల్ హాసన్ పై కొన్ని షాట్స్ చిత్రీకరించారు.

మూవీకి సంబంధించి షూటింగ్ ప్రారంభంకాక ముందే కమల్ హాసన్ లుక్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరో లుక్ పై ఫోకస్ చేశాడు దర్శకుడు శంకర్.

అయితే ఇది కమల్ హాసన్ లుక్ అనుకుంటే పొరపాటే.

ఇండియన్-2లో కమల్ హాసన్ తో పాటు హీరో సిద్దార్థ్ కూడా ఉన్నాడు. కమల్ హాసన్ సేనాపతి పాత్రలో కనిపిస్తే, సిద్దార్థ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట.

ఈ పాత్ర కూడా మేకప్ పరంగా చాలా విలక్షణంగా ఉండబోతోందట.

ఆ పాత్రకు సంబంధించిన లుక్ నే త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రం యూనిట్ తెలిపింది.

సిద్దార్థ్ ఇంకా ఇండియన్-2 సెట్స్ పైకి రాలేదు.

నిజానికి ఈ ప్రాజెక్టులో సిద్ధూ ఉన్నాడనే విషయం కూడా చాలామందికి తెలియదు. అందుకే అతడి ఎంట్రీని అఫీషియల్ గా ప్రకటిస్తూనే, ఒకేసారి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసే ఉద్దేశంలో ఉన్నాడు శంకర్.2.0 సినిమాకు ఇటు లైకా నిర్మాతలు, అటు శంకర్ రెండేళ్లకు పైగా టైమ్ తీసుకున్నారు.

ఇండియన్-2ను మాత్రం రికార్డు టైమ్ లో పూర్తిచేసి, ఈ ఏడాది చివరినాటికి విడుదల చేయాలనేది ప్లాన్ చేసుకుంటున్నాడు శంకర్.2.0 మేకింగ్ శంకర్ వల్ల లేట్ అయింది.

ఇండియన్-2 విషయంలో శంకర్ ఫాస్ట్ గా ఉన్నప్పటికీ కమల్ హాసన్ ముందుకు వెళ్తారా, లేదా.. వేచి చూడవలసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *