వినియోగదారుల సమాచారంపై నిఘా కోసం ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్‌..

గత సంవత్సరం యూజర్ల సమాచార దుర్వినియోగం అవుతోందంటూ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ పెద్ద సంక్షోభమే ఎదుర్కొంది.

అప్పట్లో మన దేశంలోనూ సంస్థకు తాఖీదులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో డేటా సంరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టామంటూ స్వయంగా సంస్థ వ్యవస్థాపకుడు జూకర్‌బర్గ్‌ అనేక సార్లు ప్రకటించారు.

అందులో భాగంగా సంస్థ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.

దీని ద్వారా ప్రొఫైల్‌పై  ప్రకటనల కోసం తమ డేటాను ఎలా వాడుకుంటున్నారో యూజర్లు నేరుగా తెలుసుకోవచ్చు.

‘వై అయామ్ ఐ సీయింగ్‌ దిస్‌ యాడ్‌’ (Why am I Seeing thid ad?) పేరుతో ఈ ఫీచర్‌ వినియోగదారుల తెరపై ఫిబ్రవరి 28 నుంచి కనిపించనుంది.

గతంలో ఈ ఫీచర్‌ ద్వారా ప్రకటన వెనక ఏ కంపెనీలు ఉన్నాయి, ఎలాంటి వారిని చేరాలనే లక్ష్యంతో ప్రకటనలను పబ్లిష్‌ చేస్తున్నారో తెలిసేది.

అయితే ఇప్పుడు దానికి తోడు యూజర్ల సమాచారం ఎప్పుడు, ఏ కంపెనీలకు ఇచ్చారు, దాన్ని వాడుకోవడానికి అనుమతులు ఎప్పుడు లభించాయి లాంటి అదనపు సమాచారం సైతం ఈ కొత్త ఫీచర్‌ ద్వారా మనం తెలుసుకోవచ్చు.

అంటే కంపెనీలు యూజర్ల డేటాను ఏ తేదీన తమ ‘ఫేస్‌బుక్‌ యాడ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’కు జత చేశారో కచ్చితంగా తెలుసుకోవచ్చు’.

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సోషల్‌ మీడియా సంస్థ ఫేస్ బుక్. ప్రకటనల కోసం అనేక కంపెనీలు, ఏజెన్సీలు ఫేస్‌బుక్‌ సమాచారాన్ని వినియోగించుకుంటాయి. ఇందులో వినియోగదారుల డేటా కు భద్రత విషయంలో సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ముఖ్య అంశంలు.

ఇందులో భాగంగా వినియోగదారుల డేటా కు భద్రత లేదని వార్తలు వినిపిస్తున్నాయి .. అందులో భాగంగా జరిగిందే కేంబ్రిడ్జి ఎనలైటికా ఉదంతం.

దీంతో యూజర్ల డేటాను సంరక్షించేందుకు సంస్థ అనేక దిద్దుబాటు చర్యలు తీసుకొంటుంది.

సో ఇక మీదట ఈ పిక్చర్ ద్వారా కొద్దిపాటి అవగాహన అయినా ఉంటుందేమో వేచి చూడాల్సిందే ‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *