కొత్త ఎలక్ట్రానిక్స్… రూ.1000కోట్ల వరకు రుణాలపై , కోటి ఉద్యోగాలు

కొత్త ఎలక్ట్రానిక్స్ పాలసీలో భాగంగా రుణాలపై వడ్డీ సబ్సిడీ అందివ్వనుంది. ప్లాంటు, మిషనరీ సంబంధించి రూ.1000కోట్ల వరకు రుణాలపై వడ్డీలో అందిస్తామని కేంద్రం తెలిపింది.

ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు2025 నాటికి 400 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంవడ్డీ సబ్సిడీ,

సావరిన్ పేటెంట్ ఫండ్, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ వంటి వాటిని ప్రతిపాదించిన రవి శంకర్ ప్రసాద్

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కొత్త ఎలక్ట్రానిక్స్‌ పాలసీకి కేంద్ర కేబినెట్‌ మంగళవారం పచ్చజెండా ఊపింది.

భారత్‌లో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విలువను 2025 నాటికి 400 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కేంద్రం ఈ పాలసీకి ఆమోదముద్ర వేసింది.

ప్రస్తుతం వీటి విలువ 80 బిలియన్ డాలర్ల సమీపంలో ఉంది.

కొత్త పాలసీ వల్ల కోటి మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.

కొత్త ఎలక్ట్రానిక్స్ పాలసీలో భాగంగా రుణాలపై వడ్డీ సబ్సిడీ అందివ్వనుంది. ప్లాంటు, మిషనరీ సంబంధించిన రూ.1,000 కోట్ల వరకు రుణాలపై వడ్డీలో 4 శాతం సబ్సిడీ అందిస్తామని కేంద్రం తెలిపింది.

అదే రుణ మొత్తం రూ.1,000 కోట్లు దాటితే అప్పుడు వడ్డీ మినహాయింపు రూ.1,000 కోట్ల వరకే వర్తిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం అలాగే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కూడా ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్లాంటు, మిషనరీ ఏర్పాటుకు తీసుకున్న రుణాలకు (75 శాతం వరకు మొత్తానికి) కేంద్రమే బ్యాంకులకు పూచీకత్తు ఉంటుంది.

దీని కోసం రూ.100 కోట్ల వరకు ఫండ్ ఏర్పాటు చేస్తుంది.

ఎలక్ట్రానిక్స్ ప్లాంటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇతర ఫెసిలిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాయమందించేలా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్షరింగ్ క్లస్టర్ స్కీమ్‌ సవరణను ప్రతిపాదించింది.

దీంతోపాటు సావరిన్ పేటెంట్ ఫండ్ కూడా ఆవిష్కరించింది.

దీంతో చిప్స్ ఐపీలు, చిప్స్ విడిభాగాలు తక్కువ ధరలకు అందుబాటులోకి రావొచ్చు.

కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదా ప్రస్తుత ప్లాంటు విస్తరణకు సంబంధించి ప్రత్యక్ష పన్ను ప్రయోజనాలు అందించాలని భావిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed