ఐటీ గ్రిడ్ విషయంపై నారా లోకేష్ విమర్శల వర్షం….”కాల్‌’కేయులు అంటూ ట్వీట్లు….

ఏపీ మంత్రి నారా లోకేష్ ఐటీ గ్రిడ్ వివాదం విషయమై కేటీఆర్‌పై ఘాటైన విమర్శలు చేశారు. మీరు టైం మెషిన్ ఎక్కారా అని ప్రశ్నించారు. ‘కాల్‌’కేయులు కేటీఆర్ అంటూ మరో ట్వీట్‌లో మండిపడ్డారు.

రోజు రోజుకూ ఐటీ గ్రిడ్ డేటా విషయము వివాదాస్పదంగా మారుతోంది. ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల దాడి తీవ్రం గా మారుతోంది.. మీరు ఏ నేరం చేయకపోతే ఉలికిపాటు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించగా.. మా డేటా పోయిందని మీరేమైనా కలగన్నారా అని ఏపీ మంత్రి లోకేష్ బాబు కౌంటర్ ఇచ్చారు. ట్విటర్‌ వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నారా లోకేష్ ఘాటైన విమర్శలకు దిగారు. ‘మా సమాచారం పోలేదని ఏపీ ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది.

ఓటర్ లిస్ట్ సమాచారం పబ్లిక్ డేటా అని ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది. మ‌రి ఏపీ డేటా పోయింద‌ని మీకేమైనా క‌ల ఏమైనా వ‌చ్చిందా? ఈ ఎపిసోడ్‌లో పోయింది ఏపీ డేటా కాదు. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్’ అని కేటీఆర్‌ను లోకేష్ ఎద్దేవా చేశారు.
మార్చి 2న ఎఫ్ఐఆర్ నమోదైతే ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 4.30 కి ఐటీ గ్రిడ్స్ సంస్థపై 30 మంది పోలీసుల దాడి ఎలా జరిగింది? వారం రోజుల పాటు టీడీపీ కీలక సమాచారం ఇవ్వాలని మీరు ఉద్యోగుల‌ను, వారి కుటుంబ సభ్యులను వేధించారని మరో ట్వీట్‌లో కేటీఆర్‌పై లోకేష్ మండిపడ్డారు.

‘‘టైం మెషీన్ ఎక్కిన కేటీఆర్ గారూ.. మా డేటా ఎత్తుకెళ్లిపోయి…‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అంటున్నారు. సావాస దోషం మ‌రి! ల‌క్షల కోట్ల దొంగ‌తో స్నేహం మిమ్మ‌ల్నీ దొంగని చేసింద’’ని జగన్‌తో టీఆర్ఎస్ స్నేహాన్ని ఏపీ మంత్రి ఎద్దేవా చేశారు.

‘‘3 ‘కాల్’ కేయులు కేటీఆర్ గారూ.. దొంగత‌నంగా తీసుకెళ్లిన మా టీడీపీ డేటాతో హైద‌రాబాద్ కేంద్రంగా న‌డిచే కాల్ సెంట‌ర్ నుంచి టీడీపీ కార్య‌క‌ర్త‌కి వ‌చ్చిన ఫోన్ కాల్ ఇది. ఓ సారి వినండి ‘కాల్‌’కేయులు కేటీఆర్ గారూ!’’ అని కేటీఆర్‌పై లోకేష్ ఘాటైన విమర్శలు చేశారు. ఇక ఈ విషయం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి మరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed