ప్రత్యక్ష ఎన్నికల్లో నారా లోకేశ్‌ తొలి విజయం? చినబాబు చరిత్ర తిరగ రాస్తారా?

ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన నేతల్లో నారా లోకేశ్ ఒకరు.

ఆయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవడమే దీనికి కారణం.

మంగళగిరిలో నారా లోకేశ్ గెలిస్తే చరిత్ర తిరగ రాసినట్టే.

ఏపీ ఎన్నికల ఫలితాల విడుదల వేళ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో నారా లోకేశ్ ఒకరు. లోకేశ్ ముఖ్యమంత్రి తనయుడు కావడం, తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవడటమే దీనికి కారణం. రాజధాని పరిధిలోని మంగళగిరి నుంచి బరిలో దిగిన లోకేశ్..

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తలపడ్డారు. లోకేశ్‌కు ఆళ్ల గట్టి పోటీ ఇచ్చారని అంచనా వేస్తున్నారు. ఇక్కడ టీడీపీ, వైసీపీ హోరాహోరీగా ప్రచారం చేశాయి. జగన్ కూడా మంగళగిరిలో ప్రచారం నిర్వహించారు. 

మంగళగిరిలో లోకేశ్ ఓడిపోతాడని వైసీపీ నాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్‌ మాత్రం లోకేశ్ విజయం సాధిస్తాడని అంచనా వేశాయి. లోకేశ్ గెలుస్తాడా లేదా అనే విషయమై భారీ స్థాయిలో బెట్టింగులు కూడా జరిగాయి.

లోకేశ్ విజయం కోసం టీడీపీ రూ.300 కోట్లు ఖర్చు పెట్టిందని వైసీపీ విమర్శించింది. 
మంగళగిరిలో 2014లో ఆళ్ల రామకృష్ణా రెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై గెలుపొందారు. ఆళ్లకు 88,977 ఓట్లు రాగా.. చిరంజీవికి 88965 ఓట్లొచ్చాయి.

చేనేత వర్గం, ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో విజయం కోసం నారా లోకేశ్ గట్టిగానే ప్రచారం చేశారు. చివర్లో ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా ప్రచారం నిర్వహించారు. 1985 తరువాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరలేదన్న లోకేశ్.. ఈసారి ఇక్కడ గెలిచి 30 ఏళ్ల చరిత్రను తిరగరాస్తామన్నారు. 

స్థానికేతరుడనే ముద్ర, ఎన్నికల ప్రసంగాల్లో పదే పదే తప్పులు దొర్లడం లోకేశ్ మైనస్ పాయింట్లు కాగా.. మంత్రిగా రాజధాని మంగళగిరిలో లోకేశ్ ఓడిపోతాడని వైసీపీ నాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్‌ మాత్రం లోకేశ్ విజయం సాధిస్తాడని అంచనా వేశాయి. లోకేశ్ గెలుస్తాడా లేదా అనే విషయమై భారీ స్థాయిలో బెట్టింగులు కూడా జరిగాయి.

లోకేశ్ విజయం కోసం టీడీపీ రూ.300 కోట్లు ఖర్చు పెట్టిందని వైసీపీ విమర్శించింది. 
మంగళగిరిలో 2014లో ఆళ్ల రామకృష్ణా రెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై గెలుపొందారు. ఆళ్లకు 88,977 ఓట్లు రాగా.. చిరంజీవికి 88965 ఓట్లొచ్చాయి.

చేనేత వర్గం, ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో విజయం కోసం నారా లోకేశ్ గట్టిగానే ప్రచారం చేశారు. చివర్లో ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా ప్రచారం నిర్వహించారు. 1985 తరువాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరలేదన్న లోకేశ్.. ఈసారి ఇక్కడ గెలిచి 30 ఏళ్ల చరిత్రను తిరగరాస్తామన్నారు. 

స్థానికేతరుడనే ముద్ర, ఎన్నికల ప్రసంగాల్లో పదే పదే తప్పులు దొర్లడం లోకేశ్ మైనస్ పాయింట్లు కాగా.. మంత్రిగా రాజధాని ప్రాంతమైన మంగళగిరి డెవలప్‌మెంట్ కోసం పని చేయడం, పార్టీ గెలిస్తే మళ్లీ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్లు. ఎమ్సెల్సీగా ఎన్నికైన లోకేశ్ చంద్రబాబు మంత్రివర్గంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తోన్న సంగతి తెలిసిందే. 

2017లో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన సమయంలో తన పేరిట రూ.273.84 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని లోకేశ్ తెలిపారు. కాగా 2019 ఎన్నికల్లో నామినేషన్ వేసిన సమయంలో తన పేరిట రూ. 319.68 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని లోకేశ్ అఫిడవిట్లో పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *