జనసేనకు షాక్… నాదెండ్ల పక్కచూపులు?

గత కొన్నాళ్లుగా పవన్ కల్యాణ్ వెంటే కనిపిస్తూ ఉన్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారా?

పవన్ జనాలకు కనిపించినప్పుడల్లా ఆయన వెంట తప్పకుండా కనిపిస్తూ.. పవన్ అంటే నాడెండ్ల, నాదెండ్ల అంటే పవన్ అన్నట్టుగా సాగుతున్న పరిస్థితిలో మార్పు రాబోతోందా?

కొన్ని నెలలుగా జనసేన కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నట్టుగా కనిపిస్తున్న నాదెండ్ల ఆ పార్టీకి తలాక్ చెప్పనున్నారా?

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పుకార్లు షికారు చేస్తూ ఉన్నాయి.

జనసేనలో నంబర్ టు, పవన్ కు రాజకీయ మార్గదర్శి.. అనే ప్రచారాలు పొందుతూ ఉన్నా నాదెండ్ల మనోహర్ ఇప్పుడు పవన్ కు గుడ్ బై చెప్పున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది.

జనసేన రాజకీయాలతో ప్రయోజనం లేదనే విషయాన్ని ఆయన తెలుసుకున్నారని, జనసేనకు తలాక్ చెప్పి.. మరోరూటు చూసుకోబోతున్నారని అంటున్నారు.

ఒక పార్టీ అధినేతతో సమావేశం కోసం రెడీ అవుతున్నారట నాదెండ్ల.

అయితే ఇదంతా ప్రస్తుతానికి ప్రచారం మాత్రమే. ఈ విషయానికి అధికారిక ధ్రువీకరణ ఏమీలేదు. జనసేనలో ఇప్పటివరకూ చెప్పుకోదగిన నేతలు ఎవ్వరూ చేరలేదు.

బీజేపీ తరఫున పోటీచేసినా వేస్టే అని తేల్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఆకుల ఆ పార్టీలో చేరినా మరీ అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.

రావెల పరిస్థితి కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. చెప్పుకోదగిన మాజీ ప్రజా ప్రతినిధుల్లో నాదెండ్ల కూడా ఒకరు.

ఆయన చేరడంతోనే పవన్ కల్యాణ్ ఆయనను వెంట తిప్పుకోని రోజంటూ లేకుండాపోయింది. అలాంటిది ఇప్పుడు నాదెండ్ల నిజంగానే జనసేనను వీడితే ఆ పార్టీకి ఆ పరిణామం శరాఘాతం అవుతుంది.

వెనుకటికి ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా.. ఇలానే కొంతమంది నేతలు ఎన్నికల ముందే బయటకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి.

కాబట్టి నాదెండ్ల విషయంలో జరుగుతున్న ప్రచారం పుకార్లే అనుకోవాలో లేక నిజంగానే నాదెండ్ల బయటకే రానున్నారో.. మరికొంత సమయం సస్పెన్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *