‘తెరకెక్కిన బయోపిక్ మూవీ రెండో భాగం’ ట్విట్టర్ రివ్యూ: బాలయ్య 110/100

ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో రెండో భాగం ‘మహానాయకుడు’పై పెద్దగా అంచనాలు లేవు.

అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ మూవీ తొలి నుండి ధీమా వ్యక్తం చేసింది

ప్రీమియర్స్ ద్వారా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు ఈ చిత్రంపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారు

జీవిత చిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మూవీ రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ శుక్రవారం నాడు థియేటర్స్‌లో విడులైంది.

ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో ఒక్కరోజు ముందుగానే అంటే గురువారం నాడు రాత్రి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ప్రీమియర్ షోలు నిర్వహించారు.

ఈ ప్రిమిమర్ షోలకి నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఈ సినిమాలో నటించిన నటీనటులు, ఇండస్ట్రీ ప్రముఖులు, నందమూరి అభిమానులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.
ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ: అన్నీ ఉన్నా అసంపూర్ణం

ఇక ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో రెండో భాగం ‘మహానాయకుడు’పై పెద్దగా అంచనాలు లేవు.

అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ మూవీ తొలి నుండి ధీమా వ్యక్తం చేసింది. ప్రీమియర్స్ ద్వారా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు ఈ చిత్రంపై పాజిటివ్‌‌గా స్పందిస్తున్నారు. పలు చోట్ల ఈ మూవీ ఇప్పటికే ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ ద్వారా స్పందనలు తెలియజేస్తున్నారు.

‘మహానటి’ చిత్రంతో టాలీవుడ్ తొలి బయోపిక్ చిత్రాన్ని అందించి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన దర్శకుడు నాగ్ అశ్విన్‌ ఈ చిత్రంపై స్పందించారు.

బాలయ్య నటనకు 110/100 మార్కులు వేసిన ఈయన చంద్రబాబుగా రానా.. .. బసవతారకంగా విద్యాబాలన్ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారని.. ‘బాబు మామూలోడు కాదంటూ’ చిత్రంలోని డైలాగ్‌ని ట్వీట్‌లో పొందుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *