విజయవాడ వేదికగా అంతర్జాతీయ ఇంధన సదస్సులో సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గోంటున్నారు

అంతర్జాతీయ ఇంధన సదస్సుకు విజయవాడ వేదిక కానుంది.మంగళ, బుధవారాల్లో సదస్సు నిర్వహించనున్నారు.

  • రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరంతర విద్యుత్‌ సరఫరా..
  • నామమాత్రంగా నష్టాలు..గ్రీన్‌ ఎనర్జీ విధానంలో భాగంగా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి..
  • గ్రామం యూనిట్‌గా సోలార్‌- విండ్‌ గ్రిడ్‌ ..
  • సోలార్‌ వ్యవసాయ పంప్‌ సెట్లు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

నెడ్‌క్యాప్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా.. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ డాల్‌బర్గ్‌, ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, టీఈఆర్‌ఐల సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో అంతర్జాతీయ విద్యుత్‌ సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి 300కు పైగా విద్యుత్‌ ఉత్పత్తి, పరికరాల తయారీ సంస్థల ప్రతినిధులూ పాల్గొంటారు.

సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు.

సాఫ్ట్‌ బ్యాంకు ఎనర్జీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ మనోజ్‌ కొహ్లి, రెన్యూ పవర్‌ చైర్మన్‌ సుమంత్‌ సిన్హా, ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ డైరెక్టర్‌ అజయ్‌ మాథూర్‌, సుజ్లాన్‌ ఎండీ జేపీ చలసాని, చైర్మన్‌ తులసి తంటి, ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌కు చెందిన ఉపేంద్ర త్రిపాఠి, ఆసియన్‌ డల్‌బెర్గ్‌ అడ్వయిజర్స్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ గుప్త పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *