విద్యారంగ సమస్యలపై ఫిబ్రవరి 18న చలో పార్లమెంటు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూన్న విద్యారంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 18న చలో పార్లమెంటు నిర్వహించాలని చండీగఢ్ లో శనివారం జరిగిన జాతీయ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సమావేశంలో తీర్మానించినట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఉపాధ్యాయ విద్య సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు జనవరిలో దక్షిణాది రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలతో చెన్నైలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నార.

సర్వశిక్ష అభియాన్ లో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణ సహా విద్యారంగాన్ని ప్రైవేట్ నుంచి రక్షించాలని, కాంట్రాక్ట్ ఉపాధ్యాయ విద్యావాలంటీర్ల విధానాన్ని రద్దు చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యుడు గాజుల నాగేశ్వరరావు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *