ఎమ్మెల్యేల గుడ్ బాయ్ కు.. బాబు స్పందన ఇది..

ఇదంతా కుట్ర..’ అన్నారట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ‘కుట్రలో భాగంగానే ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారు..’అని కూడా వాపోయారట!

అరెరే.. ఎంత పని జరిగింది! ముగ్గురు  ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పార్టీకి తలాక్ చెప్పేసరికే బాబుగారు ఇంతలా ఆవేదన వ్యక్తం చేసేస్తున్నారే! 

మరి ఈయనగారు 23 మంది వరకూ ఎమ్మెల్యేలను పిలిచి మరీ కండువాలు వేసినప్పుడు ఏమీ అనిపించలేదు. రాజకీయాల్లో కొంతమంది అధికారం వెంటే ఉంటారు. అధికారం ఎవరి చేతిలో ఉంటుందో వారి వైపే వెళ్తారు.

అలాంటి వారినే గాక.. కొంతమంది పై తీవ్ర స్థాయి ఒత్తిడి తీసుకు వచ్చి, వారిపై కేసులు పెట్టించి, వారి అనుచరులను  ముప్పు తిప్పలు పెట్టి.. తెలుగుదేశం పార్టీలోకి వస్తే వందల కోట్ల లబ్ధికి హామీలు ఇచ్చి బాబు వారికి పచ్చకుండువాలు వేశారనేది పచ్చి నిజం!అలా దాదాపు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను బాబు చేర్చుకున్నారు. ఇంకా జగన్

చేతిలోకి అధికారం వెళ్లలేదు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే.. ఎన్నికలకు ముందే చంద్రబాబు దగ్గర నుంచి ఇలా ఎమ్మెల్యేలు బిచాణా ఎత్తేస్తున్నారు. జగన్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఆయన ఓడిపోయిన తర్వాత కొంతమంది బాబు వద్దకు వచ్చారు.

అది కూడా అధికారం చూసి.. ఒత్తిళ్లు భరించలేక! ఇంకా ఎన్నికల్లో నెగ్గడానికి బాబు రకరకాల ఎత్తులు వేస్తుండగానే ఎమ్మెల్యేలు పరార్ అవుతున్నారు.

ఇక బాబుగారికి ‘కుట్ర..’అనడం కొత్త ఏమీ కాదులే. తనకు వ్యతిరేకంగా ఏం జరిగినా అది ‘కుట్ర’ అనే అనిపిస్తుంది.

తను ఎన్ని ‘కుతంత్రాలకు’ పాల్పడినా అవి మాత్రం ఆహ్లాందంగా అనిపిస్తాయి ఆయనకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *