మంత్రి భూమా అఖిలప్రియ భర్త దందా….. టీడీపీ నేత చంద్రబాబుకు ఫిర్యాదు.

ఒక ప్రముఖుడి కూతురితో విడాకులు అనంతరం మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లి చేసుకున్నారు. అయితే సదరు మంత్రిగారి భర్త గారు, ఇప్పుడు పొలిటికల్ హెడ్లైన్స్ ను డి కొడుతున్నారు.

నంద్యాలలో ఆయన దందా మామూలుగా లేదని సమాచారం అఖిల ప్రియ భర్త అనే హోదాలో అయిన చాలా వ్యవహారాలు నడిపిస్తున్నారని, అంది వచ్చిన రాజకీయ అవకాశంతో విజృంభిస్తున్నారని తెలుస్తోంది.

ఆళ్లగడ్డ, నంద్యాల ఏరియాల వ్యవహారాలలో మంత్రిగారి భర్తదే హవా, అంతా తానే అయి చూసుకుంటున్నాడట.

బెదిరింపులు, వసూళ్లు అటువంటి విషయాలను ఆయనకు తిరుగు లేదని సమాచారం. వివిధ వర్గాల వారు వాపోతున్నారు.

ఈ విషయంలో చంద్రబాబుకి కూడా ఫిర్యాదులు వెళ్లాయి అని సమాచారం.

అయితే భర్తను వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయించాలని అఖిలప్రియ భావిస్తోందట.

ఈ మేరకు చంద్రబాబుకు కూడా ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశాలు లేవని సమాచారం.

అందుకే అఖిలప్రియ ఫ్యామిలీ జనసేన లో కూడా కర్చీఫ్ వేసిందట. భర్త ప్రోద్బలంతో జనసేన లో చేరే సూచనలు ఖాయమని అంటున్నారు.

అయితే ఈ ప్రచారాన్ని అఖిల ప్రియ ఖండించింది. కానీ ఈ ఖండన పై పైకి మాత్రమే అని, లోలోపల అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయని నంద్యాల వాసుల టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *