ఏలూరులో వైఎస్ జగన్ నిర్వహించే బీసీ గర్జన జయప్రదం చేయవలసిందిగా మల్ల విజయప్రసాద్ పిలుపునిచ్చారు*

ఈనెల 17న ఏలూరులో సిఆర్ రెడ్డి కళాశాల మైదానంలో జరగనున్న బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ లోక్సభ సమన్వయకర్త MVVసత్యనారాయణ,, నగర అధ్యక్షుడు మల్ల విజయప్రసాద్ పిలుపునిచ్చారు.

మల్కాపురం లో సోమవారం ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో వారు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన నాలుగున్నరేళ్ల లో రాష్ట్రంలో బీసీ వర్గాలకు అన్యాయం చేసిన టిడిపి ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారికి లేనిపోని వాగ్దానాలు చేస్తుందని అన్నారు.

టిడిపి పాలనలో రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగిందని అంతా గ్రహించారని, ఇంతకాలం సీఎం చంద్రబాబు నాయుడికి బీసీల గుర్తుకు రాలేదు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం తో బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్లు చేస్తామనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే బీసీలకు ఇచ్చిన వాగ్దానలను కచ్చితంగా నెరవేరుస్తారని వారు పేర్కొన్నారు. త్వరలో గ్రామాల వారీగా సమావేశాలు, నియోజకవర్గ పరిధిలో 160 గ్రామాలు కాలనీలు త్వరలోనే ప్రజలతో మమేకమై సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

ఇంటింటా నవరత్నాల పథకాలపై ప్రచారం తో పాటు టిడిపి అవినీతి,మోసాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఎన్నికల ముందు అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని, కల్లబొల్లి కబుర్లతో, ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసి, తిరిగి సీఎం పదవిని అలంకరించాలని కోరికతో ఉన్నారు.

ప్రజలెవరూ సీఎం చంద్రబాబు నాయుడుని నమ్మే పరిస్థితిలో లేరని, రానున్న ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడం ఖాయమని, ప్రజలంతా జగన్ రాకకై ఎదురు చూస్తున్నారని. జగన్ గెలుపు ని ఎవరూ ఆపలేరని, బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక జగన్ నెరవేరుస్తాడని, బీసీలుచంద్రబాబు నునమ్మే స్థితిలో లేరని, ఈ బిసి గర్జనకు సంఘ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, బిసి నాయకులంతా జగన్ కి మద్దతుగా చేయూతనివ్వాలని కోరుకుంటున్న మీ మల్ల విజయప్రసాద్.

ఈ యొక్క కార్యక్రమంలో మాజీ డిప్యూటీ దాడి సత్యనారాయణ ,మాజీ కార్పొరేటర్ పిల్లా కన్నబాబు గారు ,జి శ్రీ ధర్ మొదలగు వారంతా పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *