మహేష్ బాబు ‘మహర్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్ఏప్రిల్ 25 భారి విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.

ముందుగా ప్రకటించిన తేదీకే విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్

‘మహర్షి’ రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్ర యూనిట్ఏప్రిల్ 25న భారీ విడుదలమహేష్ 25 మూవీగా మహర్షి మహేష్‌తో జోడీ కట్టిన పూజా హెగ్డే.

సూపర్ స్టార్ మహేష్ బాబు అప్ కమింగ్ మూవీ ‘మహర్షి’ విడుదల తేదీని కన్ఫామ్ చేసుకుంది.

మహేశ్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు.

మూడో వంతు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

వాస్తవానికి ఏప్రిల్ 5నే ఈ చిత్రం విడుదల కావాల్సిఉండగా.. ఏప్రిల్ 25కి వాయిదా పడింది.

అయితే షూటింగ్‌ మరింత ఆలస్యం కావడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఏప్రిల్‌లో కూడా వచ్చే అవకాశం లేదంటూ వార్తలు వచ్చాయి.

అయితే మహర్షి విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేవని ముందుగా ప్రకటించినట్టే ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్.

మార్చి 15 నాటికి షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని.. పెండింగ్‌లో ఉన్న రెండు సాంగ్స్‌ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్ని వేగవంతం చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు.

ఈ చిత్రంలో మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘భరత్ అనే నేను’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు వస్తుండంటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *