వాయిదా మీద వాయిదాలు తీసుకుంటున్న మహానాయకుడు

ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదల అయిన విషయం తెలిసిందే. ఇక మహా నాయకుడు విడుదల ఎప్పుడు అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది.

ముందుగా అనుకున్న డేట్ జనవరి 25 లేదా 26, తర్వాత అది కాస్తా ఫిబ్రవరి 7 కి మారింది. అక్కడినుండి మళ్లీ ఫిబ్రవరి 15 లేదా 22 అని అన్నారు. కాకపోతే అది కాస్తా సమ్మర్ కే వెళ్లిపోవచ్చు అన్న గాసిప్ కూడా ఉంది.

జనవరి మూడో వారంలో నే ఎన్టీఆర్ బయోపిక్ విడుదల చేస్తానని క్రిష్ పట్టుబట్టారు అప్పట్లో. చిత్ర యూనిట్ అంతా దీనిని వ్యతిరేకించారు. కానీ బాలకృష్ణ, క్రిష్ నిర్ణయానికే వదిలేసారు.

ఫస్ట్ పార్ట్ పూర్తయ్యే సమయానికి రెండో పార్ట్ ను ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఈ పరిస్థితిలో రెండో పార్ట్ వర్క్ మీద క్రిష్ కి పూర్తి అవగాహన ఉండి తీరాలి. కానీ రెండో భాగం షూటింగ్ ఫిబ్రవరి 2 వరకు సాగుతూనే ఉంది.

రెండో భాగంలో సినిమాటిక్ కంటెంట్ను అలాగే ఎమోషన్ కంటెంట్ను పెంచి మార్పులు చేయడమే ఇందుకు కారణమని గాసిప్లు వచ్చాయి.

ఈ సంగతి పక్కన పెడితే సినిమాకు రికార్డింగ్ మొదలైన పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి.

అని అవన్నీ కలిపి 20 వరకు పూర్తయ్యే అవకాశాలు లేవని ఇప్పుడు వినిపిస్తోంది. అయితే ఈ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు.

అసలు ఫిబ్రవరి 7 నుంచి వాయిదా ఎందుకు ఇప్పటి వరకు ఇప్పటివరకు బయటకి రానేలేదు. ప్రచారం లేదు కాబట్టి వాయిదా అయింది అని పక్కా అయింది.

కాగా 15 , 22 ఏది కన్ఫామ్ అన్నది కూడా అధికారికంగా ప్రకటించలేదు. సర్కిల్లో మాత్రం 15 కు రావడం ఇంపాజిబుల్ అని వినిపిస్తోంది.

అంతేకాదు 22 కి విడుదల చేయాలన్న కూడా డే అండ్ నైట్ వర్క్ చేయాలని వినిపిస్తున్న మరో టాక్.

ఏ మాత్రం తేడా వచ్చినా సమ్మర్ కి వెళ్ళిపోతుంది మహానాయకుడు అంటున్నారు.

సినిమాకి బయ్యర్లు ఎవరో కాదు సాయి కొర్రపాటి ,అనిల్ సుంకర, క్రిష్.. ఇలా అంతా బాలయ్య సన్నిహితులే.

అందుకే ఎవరికీ ఏమీ చెప్పకుండా మౌనంగా వైట్ అండ్ వాచ్ లో వున్నారని టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *