మాఘ పౌర్ణమి.. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

మాఘ మాసమంతా నదీ స్నానం సాధ్యం కాకపోయినా కనీసం శుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి రోజులలో అయినా చేయాలని, ఎందుకంటే అన్ని జలాల్లోనూ గంగ ప్రవేశించి ఉంటుందని నమ్మకం.

మాఘస్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షుతోపాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మ పురాణంలో పేర్కొన్నారు.

ఇలాంటి ప్రభావాలకు ముఖ్య కారణం సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడమే.

ఈ సమయంలో శివకేశవులు ఇరువురినీ పూజించాలనీ, దాన ధర్మాలు చేయాలనీ సాధ్యమైనంత వరకు దైవచింతనతో గడపాలని పండితులు చెబుతారు.

ఈ మాసమంతా నదీ స్నానం సాధ్యం కాకపోయినా కనీసం మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి రోజులలో అయినా చేయాలి.

ఎందుకంటే అన్ని జలాల్లోనూ గంగ ప్రవేశించి ఉంటుందన్న నమ్ముతారు.

పౌర్ణమిలలో కెల్లా శ్రేష్ఠమైనదిగా చెప్పుకునే మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతోన్న కుంభమేళాకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మాఘమాసం స్నానానికే అధిక ప్రాధాన్యత ఉండటం, అందులో పౌర్ణమి కావడంతో పుణ్య స్నానాలకు యాత్రికులు పోటెత్తారు.

కుంభ మేళాకు భక్తుల రాకతో ప్రయాగ్ రాజ్‌లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేసిన అధికారులు, కుంభ్‌నగర్‌లో ఎలాంటి వాహనాలను అనుమతించడంలేదు.

అధికారులు, కీలక సేవలు, మీడియా వాహనాలకు మాత్రమే విడిచిపెడుతున్నారు.

కుంభమేళాలో రెండో అతిపెద్ద సాహ్నీ స్నానం మాఘ పౌర్ణమి రోజున జరుగుతుంది. మౌని అమావాస్య రోజున 5 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు.

జనవరి 15న మకర సంక్రాంతితో ప్రారంభమైన కుంభమేళా మార్చి 4న మహా శివరాత్రితో ముగియనుంది. పవిత్ర గంగానది వెంట 8 కిలోమీటర్ల పొడవునా 40 స్నాన ఘట్టాలను నిర్మించారు.

అలాగే భద్రత కోసం దాదాపు 20 వేల మంది సైనికులకు వినియోగిస్తున్నారు.

అలాగే, అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో భక్తులు స్నానాలు ఆచరించే 100 మీటర్ల పరిధిలో ఫోటోలు తీయడంపై కూడా అధికారులు నిషేధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *