తెలంగాణ మంత్రుల శాఖల లిస్ట్… అనుభవానికే పేద్ధ పిట

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, సీఎం కేసీఆర్ మంత్రులకు శాఖలను కేటాయించారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ మంత్రిత్వ శాఖలను ఇచ్చారు. ఈ మేరకు రాజకీయ వర్గాలకు షాక్ తగిలినటే.

మంత్రుల ఎంపికల విషయం లో తనదైన మార్క్ చూపెట్టిన సీఎం కేసీఆర్, శాఖల కేటాయింపులోనూ అదే తీరు చుపుతున్నరు.అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మంత్రిత్వ శాఖలను కేటాయించారు.కీలకమైన వ్యవసాయ శాఖను నిరంజన్ రెడ్డికి ఇచ్చారు.

తెలంగాణ మంత్రుల శాఖల వివరాలు.. ఇవి…

తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం…సభ్యులకు సీఎం కేసీఆర్ శాఖల వారీగా కేటాయింపులు చేశారు. అందరి ఊహాగానాలను తెరదించుతూ రాజకీయ వర్గాలను మరోసారి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.

మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపులో సీఎం కేసీఆర్ తన మార్కును స్పష్టంగా చూపెట్టారు. కీలకమైన వ్యవసాయ శాఖను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కేటాయించారు. అదేవిధంగా వైద్య, ఆరోగ్య శాఖను ఈటల రాజేందర్‌కు, విద్యా శాఖను జగదీశ్ రెడ్డికి కేటాయించాగా,గత ప్రభుత్వంలో ఈటల ఆర్థిక శాఖను నిర్వహించగా.. జగదీశ్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

మంగళవారం (ఫిబ్రవరి 19) ఉదయం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ మొత్తం 10 మంది సభ్యులతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో సీఎం కేసీఆర్‌తో కలిపి మంత్రుల సంఖ్య 12కు చేరింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత డిసెంబర్ 13న కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం మహమూద్ అలీకి కీలకమైన హోంశాఖ కేటాయించారు.

తెలంగాణ మంత్రులు – శాఖలు

అనుభవానికే పెద్దపీట వేస్తు
విస్తరణ జరిగినట్టు సమాచారం. … ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇంద్రకరణ్‌రెడ్డి రెండుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, తలసాని ఉప ఎన్నికలతో కలిపి ఆరేసిసార్లు, తలసాని అయిదుసార్లు గెలిచారు. ఇక జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రశాంత్‌ రెడ్డి రెండేసిసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మల్లారెడ్డి గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలవగా.. ఈసారి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌కు అప్పట్లో మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా.. నెరవేరలేదు. ఈసారి వారిద్దరికీ చోటు కల్పిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నిరంజన్‌ రెడ్డికి కీలకమైన వ్యవసాయ శాఖ కేటాయించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేయడం, కేసీఆర్‌కు సన్నిహిత వ్యక్తి కావడం వల్లే మంత్రివర్గంలో ఆయనకు ఇంత ప్రాధాన్యం దక్కించుకున్నట్లు సమాచారం.

 • 1) సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి – వ్యవసాయ శాఖ
 • 2) ఈటల రాజేందర్ – వైద్య, ఆరోగ్యం
 • 3) కొప్పుల ఈశ్వర్ – సంక్షేమ శాఖ
 • 4) ఎర్రబెల్లి దయాకర్ రావు – పంచాయతీరాజ్,గ్రామీణాభివ ద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్
 • 5) తలసాని శ్రీనివాస్ యాదవ్ – పశు సంవర్థక శాఖ
 • 6) వేముల ప్రశాంత్ రెడ్డి – రవాణా, రోడ్లు భవనాలు
 • 7) అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి – దేవాదాయ, అడవులు, పర్యావరణం, న్యాయ శాఖ
 • 8) వి. శ్రీనివాస్ గౌడ్ – ఎక్సైజ్, టూరిజం, క్రీడలు (స్పోర్ట్స్)
 • 9) జి. జగదీశ్ రెడ్డి – విద్యా శాఖ
 • 10) చామకూర మల్లారెడ్డి – కార్మిక, ఉపాధి, మానవ వనరుల అభివృద్ధి
 • 11) మహమూద్ అలీ – హోం మంత్రిత్వ శాఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *