ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం ఉదయ Kulungura (కులుంగుర) ప్రాంతంలోని లింగానికి గుర్తింపు లభించింది

తమిళనాడు కేరళ సరిహద్దుల్లో చంగల్ మహేశ్వర శివ పార్వతి ఆలయం ఉంది చారిత్రక ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయ ప్రాంగణంలో ప్రపంచంలోని ఎత్తైన శివలింగం నిర్మించాలని 2012లో ఆలయ వర్గాలు నిర్ణయించాయి, ఆ మేరకు 10 కోట్ల వ్యయంతో 111,2 అడుగుల ఎత్తుతో 8 అంతస్తులుగా శివలింగ నిర్మాణాన్ని ప్రారంభించారు, ప్రతి అంతస్తులోని ధ్యాన మండపాలు కలిగిన ఈ శివలింగం లోపలి భాగం గుహలను తలపిస్తుంది, అందులోని పరశురాముడు అగస్త్యుడు తదితరులు తపస్సు చేస్తున్నట్లు కొన్ని ప్రతిమలు ఏర్పాటు చేశారు, కింది అంతస్తులో భక్తులు అభిషేకం ఆరాధనలు చేసేందుకు అనువుగా శివలింగం ఎనిమిదో అంతస్తు లో కైలాస గిరిలో శివపార్వతుల ఉన్నట్టు ప్రతిమలు కొలువుదీర్చారు, ప్రస్తుతం 80 శాతం పనులు ముగిసిన నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా దీనికి గుర్తింపు లభించింది, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ మేరకు గుర్తింపు లభించింది, ఇందుకు సంబంధించిన పచ్చని ఆ సంస్థ సమన్వయకర్త షాహిద్ నేతృత్వంలోని బృందం ఆలయ నిర్వాహకులు అందించింది, మహాశివరాత్రి నాటికి మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని ఆలయ ప్రతినిధులు నిర్ణయించారు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగ గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉన్నది ఇది మన ఇండియా లో నిర్మించడం మనకెంతో గర్వకారణం గా ఉంది, ఇలాంటి నిర్మాణాన్ని తలపెట్టిన ఆలయ ప్రతినిధులను మెచ్చుకోక తప్పదు, ఇలాంటి నిర్మాణాల వలన మన దేశ ప్రతిష్ట ఎంతో పెరుగుతుంది, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన నిర్మాణాలను ప్రతి ఒక్కరూ తలపెట్టాలి, ఇలాంటి నిర్మాణాన్ని తలపెట్టిన ఆలయ ప్రతినిధులను తప్పక ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *