పల్లె గొప్పదా? పట్నం గొప్పదా?

పల్లె గొప్పదా,. పట్నం గొప్పదా ? అని ఒకప్పుడు ఉపన్యాస పోటీలు పెట్టేవారు. పట్నాల్లో ఉండే పిల్లలు సైతం పల్లె గొప్పదనం గురించి మాట్లాడేవారు. ఎందుకంటే పల్లెలంటే గౌరవం, మమకారం, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలన్న ఆకాంక్షల్ని వ్యక్తం చేసేవారు. ఇప్పుడు అలాంటి పోటీలు పెడితే పట్నం గొప్పతనం గురించి చెప్పేవారు అధికులు. పల్లెల గొప్పదనం గురించి కేవలం నాయకులు మాటల్లోనే వింటాం. ఇవాళ పల్లెల్లో ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదు. ప్రభుత్వాలు పల్లెల అభివృద్ధి గురించి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ వాటి విచ్చిన్నానికి దారితీసే విధానాలనే అమలు చేస్తున్నాయి. నగరీకరణకు, పట్టణికరణకు దారులు సుగుమం చేస్తున్నాయి. పల్లెల్నించి వలసలు పెరిగే రీతికి దన్నుగా నిలుస్తున్నాయి. పైకి మాత్రం గ్రామాలు స్వయంపోషకం కావాలన్నా గాంధీజీ స్వప్నసాకరం కోసం శ్రమిస్తున్నట్లు పాలకులకు తీయ్యటీ మాటలు చెబుతారు. మాటలకి చేతలకీ పొంతన లేని తీరు పల్లెల్ని చూస్తే తెలిసిపోతుంది. పల్లెల పచ్చదనం గురించి వర్ణనల ఆంధ్ర ప్రాంతవు ఎక్కువగా కనిపించేవి.

వాటిని చదివిన వారు పల్లె పట్నాలు అందాల నెలవులుగా భావించేవారు. సంక్రాంతి పద్యాల్లోనూ పల్లెల పచ్చటి అందాల్ని అతి సుందరంగా వర్ణించేవారు. కాని వాస్తవంలో పల్లెల తమ స్వేచ్ఛనీ, సౌందర్యాన్ని కోల్పోతున్నాయి. క్రమక్రమంగా పల్లె దృశ్యం మారింది. పల్లె జీవితం విచ్ఛిన్నమయింది. చెరువులు మాయమయ్యాయి, బావులు ఎండిపోయాయి. వాగులు, ఏర్లు ఎండిపోయి ఏండ్లయింది. ఇసుక తప్ప నీళ్లు లేవు. ఆ ఇసుకని కూడా కాంక్రీట్ జంగిళ్ళ కోసం తరలించే ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లెల పచ్చదనంలో చిచ్చుపెట్టారు. ఎవరో కాదు బహుళజాతి కంపెనీలు, వారి తాబేదార్లయిన మన ప్రభుత్వాలు వాటికి ప్రాతినిధ్యం వహించే పాలకులు, సంపన్న దేశాల అడుగులకు మడుగులొత్తే రాజకీయ నాయకులు అంతా కలిసి పల్లెల్ని విచ్ఛినం చేశారు. పల్లె జీవితంలోని ప్రశాంతతనో కొల్లగొట్టారు. అందుకే పల్లె కన్నీరు పెడుతున్న దృశ్యాల్ని కవుల వినిపిస్తున్నారు. స్వాతంత్ర్య ం వచ్చి ఏడు పదులు దాటినా గ్రామ స్వరాజ్యం అని గాంధీజీ సదాశయం కలగానే మిగిలింది. నిజానికి ఏడుపదుల కిందటి తో పోలిస్తే గ్రామీణ జీవితం మరింత ధ్వంసమయింది. వ్యవసాయం దెబ్బతిన్నది వృత్తులు నాశనమయ్యాయి. వాటిని అంటిపెట్టుకొని వున్న శ్రమైక జీవన సంస్క్రుతి తన ప్రాభవాన్ని కోల్వోయింది. పల్లె బతుకుని హీనంగా భావించే పరిస్థితి ఏర్వడింది.

అందుకే ఇవాళ్టి పల్లెల సంవేదనని ‘ మట్టిపాట’గా వినిపించారు ఏనుగు నరసింహారెడ్డి పల్లవి పాలన వినిపిస్తూ రాసిన ఈ శతకంలో ప్రతి పద్యాన్ని ‘పల్లె బతుకు మాది పాడుగాను’ అనే మకుటంతో ముగించారు. ఇది నిఘ్టారం , నిరసన స్వరం. పల్లెల్లో బతకడం ఆదర్శంగా భావించే స్థితి ఇవాళ కనిపించదు ఎందుకంటే బతకాలంటే పని దొరకాలి. భుక్తి గడవాలి. ఏ మనాది లేకుండా మనగలగాలి. తను బతకటం కోసం, నలుగుర్ని బతికించటం కోసం పుట్టిన పల్లె బతకలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది .తను పనిచేస్తు పదుగురికీ తిండి పెట్టే పల్లె రైతు జీవితపు ఔన్నత్యాన్ని ‘ కాపుబిడ్డ’ కావ్యంలో గానం చేశారు గంగులశాయిరెడ్డి. ఒకరి కింద పని చేయడం నామోషీగా భావించే వారు కాపు బిడ్డలు. వ్యవసాయం మేలిమివృత్తిగా త
[8:20 AM, 1/9/2019] Mohini Lavanya: తలపోసేవారు. వీధి బాగోతాలు, బుర్రకథలు, వృత్తి పురాణాలు,పట్టం కథలు కానరాకుండా పోయాయి. పిండాలు పిట్టముట్టని స్థతిని అర్ట్రంగా చెప్పారు నందిని సిద్ధారెడ్డి ఓ కవితలో, మొబైల్స్ టవర్లు దాటిన పిట్టల, పక్షుల రెక్కలు తెగి పడ్డవైనాన్ని ప్రతీకాత్మకంగా సూచించారు. ప్రపంచీకరణ గ్రామాల్ని ముట్టడించి బతుకునీ , బతుకులోని సకల సఞబంధాల్ని పరాస్తం చేసిన దృశ్యాన్ని ప్రబలంగా చెబుతున్నారు కవులు.

తలపోసేవారు. వీధి బాగోతాలు, బుర్రకథలు, వృత్తి పురాణాలు,పట్టం కథలు కానరాకుండా పోయాయి. పిండాలు పిట్టముట్టని స్థతిని అర్ట్రంగా చెప్పారు నందిని సిద్ధారెడ్డి ఓ కవితలో, మొబైల్స్ టవర్లు దాటిన పిట్టల, పక్షుల రెక్కలు తెగి పడ్డవైనాన్ని ప్రతీకాత్మకంగా సూచించారు. ప్రపంచీకరణ గ్రామాల్ని ముట్టడించి బతుకునీ , బతుకులోని సకల సఞబంధాల్ని పరాస్తం చేసిన దృశ్యాన్ని ప్రబలంగా చెబుతున్నారు కవులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *