లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్! అర్జీవి హడావిడి… టిడిపికి తలపోటు

అసలు ఆ సినిమాను రామ్ గోపాల్ వర్మ తీస్తాడా లేక ఫస్ట్ లుక్ టీజర్ల హడావుడితో ఆపేస్తాడా.. అనే సందేహాలు మొన్నటి వరకూ నెలకొని ఉన్నాయి.

ఎందుకంటే ఏదో వివాదం మీద సినిమా ప్రకటన చేయడం.. ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడం ఆర్జీవీకి కొత్త ఏమీకాదు.

ఇలాంటి నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా కేవలం అలాంటి ఫస్ట్ లుక్స్ తో ఆగిపోయే పిక్చర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపించింది.

అయితే ఈ సారి వర్మ చాలా ముందే ఉన్నాడు. ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. వర్మ మాట మీద నిలబడి ఉండటం వేలంటైన్స్ డే సందర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం.. అన్నీ బాగానే ఉన్నాయి.. విడుదల అయిన కొన్ని గంటల్లోనే ఈ సినిమాకు దాదాపు రెండు లక్షల వ్యూస్ కూడా దక్కాయి.

స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాకు యూట్యూబ్ లో వీక్షణలు లభిస్తూ ఉండటం గమనించాల్సిన విషయం.

మరి ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే.. ఉండాల్సినట్టుగానే ఉన్నట్టుంది.  ఎన్టీఆర్ విషయంలో ఆయన కుటుంబీకులు వ్యవహరించిన తీరు ఇది వరకూ వార్తా కథనాలు వచ్చాయి, పుస్తకాలు వచ్చాయి.

వాటిల్లో పేర్కొన్నట్టుగానే ఈ ట్రైలర్ కనిపిస్తోంది. పిక్చర్ నాణ్యత అంతంతమాత్రంగా ఉంటుంది కానీ.. వివాదాస్పదంగా ఉంటుందని మాత్రం స్పష్టం అవుతోంది. వివాదాస్పదంగా ఏ విషయమైనా చూపించడం మన ఆర్జీవి కొత్త కాదు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఏవో పాటల విషయంలో తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్లింది. ఇప్పుడు ట్రైలర్ విషయంలో మరిన్ని పిటిషన్లు వేసుకోవాల్సిందే! ఓవరాల్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ పెద్ద దుమారాన్నే రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల్లోగా ఈ సినిమా విడుదల అయితే.. తెలుగుదేశం పార్టీకి మరింత తలభారంని పెంచే అవకాశాలు ఉన్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *