అమరావతి అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష కు బాసటగా వైసిపి విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజు

AgriGold chairman, MD produced

AgriGold chairman, MD produced

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు తాను పోరాటాన్ని కొనసాగిస్తానని ఇందులోభాగంగా సోమవారం అమరావతి అసెంబ్లీ ముందు వైఎస్సార్సీపీ ఒకరోజు దీక్షను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వైయస్సార్ సిపి పార్లమెంట్ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజు వెల్లడించారు.

ఇందుకు సంబంధించి వివరాలు తెలియ చేసేందుకు. ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని, హామీ ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అధికారంలోకి వచ్చాక తమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గురించి చూసుకున్నారు. తప్ప ప్రజలు బాధితులను పట్టించుకోలేదన్నారు.

ప్రభుత్వం సాయం చేస్తుందని నాలుగున్నరేళ్లుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

ఇబ్బందులు పెట్టే విధంగా కార్యాలయాలు చుట్టూ తిప్పించుకున్నారు అన్నారు.

బాధితుల సమస్యల పరిష్కారానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నియోజకవర్గాల వారీగా అగ్రిగోల్డ్ బాసట కమిటీ వేశారని తద్వారా పోరాటాన్ని మరింత ఉధృతం చేసినట్లు తెలిపారు.

గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ అసెంబ్లీ లొఅడిగిన ప్రశ్నకు. సమాధానంగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని తెలియజేశారు.

గత నాలుగు నెలల కిందట పది లక్షల మంది ఉన్నారని చెబుతున్నారన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులు బ్యాంకులో డిపాజిట్ చేసిన 19 లక్షలు పైగా అకౌంట్స్ ఉన్నాయన్నారు.

అధికార పార్టీ బినామీలు ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారు అని బాధితులఉసురు పోసుకుని అధికారాన్ని అడ్డంపెట్టుకొని పబ్బం గడుపుతున్నారు అనివిమర్శించారు.

అగ్రిగోల్డ్ కు సంబంధించిన మొత్తం ఆస్తులను వెలికితీయాలని. తక్షణమే బాధితులకు తగు న్యాయం చేయాలని కృష్ణంరాజు డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *