మీడియాతో మాట్లాడిన కోట్ల అసలేం జరిగింది..? టీడీపీలో చేరుతున్నారా? లేదా..? అనే విషయం తేల్చేశారు

కోట్ల యూటర్న్.. వైసీపీలో చేరాలని ఫోన్ కాల్స్ 

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరినట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు.

ఇదివరకే తన కుటుంబ సభ్యులతో కలిసి అమరావతికి వెళ్లిన కోట్ల… సీఎం చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే.

అయితే భేటీలో సీట్ల విషయంపై స్పష్టమైన హామీ రాకపోవడంతో టీడీపీలో చేరడానికి కోట్ల సాహసించలేదని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

మరోవైపు టీడీపీలో కోట్ల దాదాపు చేరిపోయినట్లేనని టీవీ చానెళ్లు, వార్త పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

మీడియాతో మాట్లాడిన కోట్ల అసలేం జరిగింది..? టీడీపీలో చేరుతున్నారా? లేదా..? అనే విషయం తేల్చేశారు.

కోట్ల మాటల్లోనే..

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని మొదట అన్నారు.. కానీ కొద్దిరోజులకే మళ్లీ పొత్తుల్లేవన్నారు.

కాంగ్రెస్ విధి విధానాలు నచ్చకనే బయటకు నేను బయటికి వచ్చాను. వైసీపీ, టీడీపీ నేతల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి.

పార్టీలో చేరమని ఆహ్వానాలు పలుకుతున్నారు. అధికార పార్టీ కాబట్టి కొన్ని డిమాండ్లతో టీడీపీ వైపు మొగ్గు చుపాను. టీడీపీలో నేను చేరానన్నది అబద్ధం.

పత్రికల్లో కొందరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసేశారు. రైతులు, నా కార్యకర్తల కోసం ఎల్ఎల్సీ, వేదవతి, గుండ్రేవుల, ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి చేస్తానని మాట ఇస్తే నేను టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను” అని కోట్ల స్పష్టం చేశారు.

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం ఫస్ట్ టైమ్‌ పార్టీలో చేరికపై మాట్లాడిన కోట్ల ఇలా రియాక్టయ్యారు.

టీడీపీలో చేరిక ముహూర్తం ఖరారైందనకుంటున్న టైమ్‌‌లో ఒక్కసారిగా

టీడీపీలో చేరిక ముహూర్తం ఖరారైందనకుంటున్న టైమ్‌‌లో ఒక్కసారిగా కోట్ల ఇలా మీడియా ముందుకు రావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఒక్కసారిగా కోట్ల ఇలా యూటర్న్ తీసుకోవడంతో ఒకింత అభిమానులు, కార్యకర్తలు సైతం కంగుతిన్నారని తెలుస్తోంది.

అయితే కోట్ల ఆఖరికి ఏ పార్టీలో చేరతారు..? ఆయన డిమాండ్ చేస్తున్న ప్రాజెక్టు పనులకు టీడీపీ నుంచి స్పందన వస్తుందా..? లేదా? లేకుంటే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా..? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *