పుల్వామా దాడితో‘కరాచీ బేకరి’ పేరు మార్పు

పుల్వామా దాడి ప్రభావంతో ‘కరాచీ బేకరి’ పేరు మార్చుకోక తప్పలేదు. ఇకపై కరాచీ బేకరీ.. ఈ పేరుతో చెలామణి కానుంది.

పుల్వామాలో భారత సైనికులపై ఆత్మహుతి దాడి తర్వాత బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాల్లోని ‘కరాచీ బేకరి’లపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

కరాచీ బేకరీని పాకిస్థాన్‌కు చెందిన వ్యాపార సంస్థగా భావిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థ ఇటీవల ఓ ప్రకటన చేసింది.

కరాచీ బేకరి భారతీయ సంస్థేనని పేర్కొంది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో కరాచీ బేకరీ పేరును మార్చాలని యాజమాన్యం నిర్ణయించింది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కరాచీ బేకరి యాజమాన్యం తాగాగా ఓ ప్రకటన చేసింది.

కరాచీ బేకరి పేరును ‘ఇండియన్ కరాచీ బేకరి’గా మారుస్తున్నట్లు వెల్లడించింది

. మోజాంజాహి మార్కెట్‌‌లో గల కరాచీ బేకరీ యాజమాన్యాన్ని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలోని బీజేపీ నేతలు ఇటీవల సంప్రదించారు. ఈ నేపథ్యంలో బేకరీ పేరును ‘ఇండియన్ కరాచీ బేకరి’గా మారుస్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *