ఐటమ్ పాపగా మారిన జూనియర్ శ్రీదేవి

టాలీవుడ్ అందాల చందమామ కాజల్.. ‘నేను పక్కా లోకల్’ అంటూ ఐటమ్ సాంగ్‌తో యూట్యూబ్‌ని ఓ ఊపి ఊపేస్తే.. ‘స్వింగ్ జరా’.. అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా ఐటమ్ అవతారంలో అదరగొట్టింది. ఇక వీళ్లకంటే ముందు సీనియర్ హీరోయిన్ శ్రియ ఐటమ్ గర్ల్‌గా ‘దోచెయ్.. దోచెయ్’ అంటూ అందాలను దోచిపెట్టింది.

  • 1.ఐటమ్ సాంగ్‌తో అల్లాడిస్తానంటోన్న రకుల్!నాని విక్రమ్ కె. కుమార్ మూవీలో ఐటమ్ సాంగ్
  • 2.ఐటమ్ సాంగ్‌కి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన నిర్మాతలు

ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్లకు ఆఫర్లు లేకపోవడంతో ఐటమ్ సాంగ్ వస్తే అల్లాడించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ అందాల చందమామ కాజల్.. ‘నేను పక్కా లోకల్’ అంటూ యూట్యూబ్‌ని ఓ ఊ పి ఊపేస్తే.. ‘స్వింగ్ జరా’.. అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా ఐటమ్ అవతారంలో అదరగొట్టింది. ఇక వీళ్లకంటే ముందు సీనియర్ హీరోయిన్ శ్రియ ఐటమ్ గర్ల్‌గా ‘దోచెయ్.. దోచెయ్’ అంటూ అందాలను దోచిపెట్టింది.

వీరితో పాటు చార్మి, అంజలి కూడా ఐటమ్ సాంగ్‌లో మెరిశారు. ఇక అప్పట్లో రమ్యక్రిష్ణ, రంభ, సిమ్రాన్‌లు కూడా ఓ ఊపు ఊపినవాళ్లే. అయితే నాకూ ఓ ఐటమ్ సాంగ్ పడితే అల్లాడిస్తానంటోంది జూనియర్ శ్రీదేవి రకుల్ ప్రీత్ సింగ్.

ఒక్క సినిమా మొత్తం పనిచేస్తే వచ్చే రెమ్యూనరేషన్ ఒక్క పాటకే వస్తుండటంతో ఐటమ్ సాంగ్‌కి రెడీ అయ్యందట రకుల్.

నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీకి ఇటీవల కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తీకేయ నెగిటివ్‌లో రోల్‌లో నటిస్తుండగా.. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్ ఉండబోతున్నట్టు సమాచారం.

ఈ చిత్రానికి మరింత గ్లామర్ హద్దేందుకు స్టార్ హీరోయిన్‌ని ఐటమ్ సాంగ్‌తో రంగంలోకి దింపనున్నారట నిర్మాతలు.

ఈ ఐటమ్ సాంగ్‌కి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో బిజినెస్ ఉమెన్ అయిన రకుల్ ఐటమ్ సాంగ్‌తో ఆడిపాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ రాజా రవితేజ లాంటి స్టార్ హీరోలతో కాకుండా.. కుర్రహీరోలు రామ్, నాగ చైతన్య, సాయి ధరమ్, బెల్లంకొండ, సందీప్ కిషన్ ఇలా టాలీవుడ్ హీరోలందరికీ బెస్ట్ ఛాయిస్‌గా మారిన రకుల్ ప్రీత్ సింగ్‌కి హిట్ పడి చాలా రోజులైంది.

‘స్పైడర్’ చిత్రం తరువాత తెలుగు ఆడియన్స్‌కి దూరమైన రకుల్ ఇటీవల ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో సీనియర్ హీరో బాలయ్యతో కలిసి జూనియర్ శ్రీదేవిగా ఆకుచాటు పిందతడిసె అంటూ వర్షంలో స్టెప్పులేసింది. ఆ తరువాత ఆమె నటించిన ‘దేవ్’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టేసింది.

రకుల్ ప్రీత్ సింగ్

ఒకవైపు యంగ్ హీరోయిన్స్‌ నుండి గట్టిపోటీ ఉన్నప్పటికీ అమ్మడుకి ఆఫర్స్ మాత్రం కొదువలేదు.

నటన పరంగా పెద్దగా ప్రభావం చూపని రకుల్ గ్లామర్ షోతో ఆఫర్లను అందిపుచ్చుకుంటుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ ఏడాదిలో ఏడు సినిమాలు లైన్‌లో పెట్టింది.

నాగచైతన్యతో వెంకీ మామా.. బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాచ్చసన్’ రీమేక్‌‌తో పాటు బాలక్రిష్ణ, బోయపాటి కాంబో మూవీలో ఈ భామే ఆఫర్స్‌ని అందిపుచ్చుకుంది రకుల్.

ఇలా వరుస ఆఫర్స్ క్యూలో ఉన్నప్పటికీ ఐటమ్ సాంగ్‌కి సైతం చిందేసేందుకు రెడీ అయ్యిందట రకుల్.

అయితే రకుల్ ఐటమ్ ఆడిపాడుతుందంటూ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు..

గతంలో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రకుల్ ఐటమ్ సాంగ్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి.

అయితే రెమ్యూనరేషన్ వద్ద నిర్మాతలు వెనకడుగు వేయడంతో ఐటమ్ సాంగ్ వర్కౌట్ కాలేదు. ఈసారైనా నాని వర్కౌట్ చేస్తాడేమో చూాడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *