గంటా వారి జంపింగ్ యాక్షన్లు…

నేతలంతా వైసిపికి జంప్ చేస్తుంటే మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

తన రాజకీయ జీవితంలో ఆఖరి రోజు వరకు చంద్రబాబుతోనే పనిచేస్తానంటూ సినిమా డైలాగులు కొడుతున్నారు.

గంటా శ్రీనివాసరావు ఎక్కువగా సినిమా వాళ్ళతో కనిపిస్తారు ఆమెరా తన నోటి నుంచి సినిమా డైలాగులు కొడుతున్నారు.

ఇప్పటికిప్పుడు గంటకు బాబు పై తన స్వామి భక్తిని తెలపాల్సిన అవసరం ఏముంది…నెలరోజులుగా గంటా గోడ దూకుతారు అంటూ పలు కథనాలు వస్తున్నాయి.

ఏ నిమిషం అయినా గంటా ఆయన కండువాను మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఇలాంటి పుకార్లను పెంచిపోషించారు గంటా… కానీ ఇప్పుడు దీనికి చెక్ పెట్టారు.

అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పాలిటిక్స్ఉన్నంతకాలం చంద్రబాబుతోనే ఉంటాను అని భారీ డైలాగులు ట్వీట్ చేశారు.

గంటా శ్రీనివాసరావు పర్మినెంట్ గా ఉన్న పార్టీ ఏదైనా ఉందా అని ప్రశ్నించుకుంటే సమాధానం దానికి లేదు.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు, ఎన్నికలకు ఏ పార్టీలో ఉంటుందో ఆ పార్టీకి జాన్ అవ్వడం గంటకు ముందునుంచి ఉన్న అలవాటు.

జంపింగ్ లో ఇంత అనుభవం ఉన్నప్పటికీ ఈ సారి గోడ దూకే ప్రయత్నం చేయలేదు. దీని వెనుక బలమైన కారణం ఉందనేది కొంత మందికి మాత్రమే తెలిసిన విషయం.

అందరికంటే ముందు గోడదూకే ది గంటా శ్రీనివాసరావే, కానీ ఈసారి ఆయన ఆ ప్రయత్నం చేయలేదు … రాష్ట్రంలో వైసీపీ చాలా బలోపేతం అవుతుందని అందరికంటే ముందు గంటలే పసిగట్టారు.

ఆ మేరకు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరేందుకు సంప్రదింపులు కూడా జరిపారు. కానీ గంటా ప్రతిపాదనను జగన్ ససేమిరా అన్నారు.

ఎలాంటి కండిషన్లు లేకుండా పార్టీలోకి రావాలని ఆయన తెలిపారు కానీ గంటా మాత్రం తనతో పాటు మరో రెండు టిక్కెట్లు ఆశించి తెలుస్తుంది.

దీంతో వైసీపీ తలుపులు మూసుకున్నాయి. ఇక ఆఖరి ప్రయత్నంగా ఆయన జనసేన పార్టీ ని కూడా వదల్లేదు.ప్రస్తుతం ఈ పార్టీ ప్రభావం కాస్త తక్కువగా ఉండటం లో టిడిపి కంటే బెటర్ అనే ఉద్దేశంతో గంట ఆ దిశగా కూడా పావులు కదుపుతున్నారు..

కానీ అక్కడ కూడా ఆయనకు ఎదురు గాలి జగన్ అని పిలవను ఇంకా గంటా ను చేర్చుకుంటే తనపై తన పార్టీపై తీవ్ర విమర్శలు పవన్ గంటా చేర్చుకునే విషయంలో వ్యతిరేకతను తెలిపారు.

దీంతో చేసేది లేక తన రాజకీయ జీవితాన్ని చంద్రబాబు కి అంకితం అంటూ ట్వీట్ తో కాలక్షేపం చేస్తున్నారు గంటా శ్రీనివాసరావు… ఇది అసలైన విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *