జేఈఈ అడ్వాన్స్‌డ్-2019 నోటిఫికేషన్ విడుదల

జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే జనవరి సెషన్ పరీక్షలు పూర్తయి..

ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఇక ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు.

వీటిలో అర్హత పొందినవారే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

1.మే 19న పరీక్ష నిర్వహణ.

2.మే మొదటివారంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.

3.జేఈఈ మెయిన్‌(పేపర్-1)లో అర్హత పొందే 2.24 లక్షల అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహణ

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ విద్యాసంస్థల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘జేఈఈ అడ్వాన్స్‌డ్-2019 ఎగ్జామినేషన్’ నోటిఫికేషన్ విడుదలైంది.

ఐఐటీ రూర్కీ గురువారం (ఫిబ్రవరి 21) జేఈఈ అడ్వాన్స్‌డ్-2019కు సంబంధించిన ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది.

జేఈఈ మెయిన్‌(పేపర్-1)లో అర్హత పొందే అన్ని వర్గాలకు చెందిన 2.24 లక్షల మంది అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్‌-2019 పరీక్ష నిర్వహించనున్నారు.

జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే జనవరి సెషన్ పరీక్షలు పూర్తయి.. ఫలితాలు కూడా విడుదలయ్యాయి.

ఇక ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ నెలాఖరుకు ఫలితాలను విడుదల చేయనున్నారు.

రెండు విడతల వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు.

అందులో 2,24,000 ర్యాంకు లోపు వచ్చిన అభ్యర్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్-2019 పరీక్షలకు ఎంపికచేస్తారు.

మే మొదటివారంలో జేఈఈ అడ్వాన్స్‌డ్-2019 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

మే 19న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు.

కోర్సులు..

  • ✦ నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ: బీటెక్, బీఎస్.
  • ✦ ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ: బీటెక్-ఎంటెక్, బీఎస్-ఎంఎస్.
  • ✦ ఐదేళ్లు ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ: ఎంటెక్, ఎంఎస్సీ డ్యూయల్ డిగ్రీ.

అర్హతలు..

  • ✦ అభ్యర్థులు జేఈఈ మెయిన్-2019 పేపర్-1లో 2,24,000 ర్యాంకు లోపల ఉండాలి.
  • ✦ 01.10.1994 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
  • ✦ అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2017, అంతకు ముందు పరీక్ష రాసి ఉండకూడదు.
  • ✦ 2018 లేదా 2019లో మొదటిసారి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలకు హాజరై ఉండాలి.✦ గతంలో ఐఐటీలో ప్రవేశం పొంది ఉండకూడదు.

దరఖాస్తు ఫీజు..

✦ రూ.2600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బాలికలు మాత్రం రూ.1300 చెల్లిస్తే సరిపోతుంది. వీటికి జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

✦ సార్క్ దేశాలకు చెందిన అభ్యర్థులు, విదేశాల్లోని భారతీయ విద్యార్థులు 75 డాలర్లు చెల్లించాలి.
✦ ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు 150 డాలర్లు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు..

  • ✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే మొదటివారంలో.
  • ✦ జేఈఈ అడ్వాన్స్‌డ్-2019 పరీక్ష తేది: 19.05.2019.
  • ✦ పరీక్ష సమయం..

పేపర్-1: ఉ. 9.00 గం.- మ.12 గం.
పేపర్-2: మ.2.00 గం.- సా.5.00 గం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *