జనసైనికులకు పవన్ బర్త్ డే గిఫ్ట్.. సెప్టెంబర్ నుంచి కొత్త పత్రిక…

పార్టీ పక్షాన ఒక పత్రికను ఏర్పాటు చేస్తున్నట్లుప్రకటించారు. పార్టీ ప్రకటనలో పార్టీ భావజాలం, నిర్ణయాలు, ప్రణాళికలు, కార్యకర్తలు, ప్రజలకు ఎప్పటికప్పడు తెలియజేయడానికి పార్టీ పక్ష పత్రికను వెలవరించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

జనసేన పార్టీ అధినేత పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పుట్టిన నెలలోనే పార్టీ పక్షాన ఒక పత్రికను ఏర్పాటు చేస్తున్నట్లుప్రకటించారు. పార్టీ ప్రకటనలో పార్టీ భావజాలం, నిర్ణయాలు, ప్రణాళికలు, కార్యకర్తలు, ప్రజలకు ఎప్పటికప్పడు తెలియజేయడానికి పార్టీ పక్ష పత్రికను వెలవరించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారని తెలియజేశారు.

ఈ పత్రికలో రాష్ట్ర, దేశ, విదేశాలకు చెందిన పాలసీ నిర్ణయాలు, అభివృద్ధి రంగాలకు చెందిన సమాచారం పొందుపరచాలని జనసేనాని చెప్పారు. మేధావులు, కార్యకర్తల అభిప్రాయలు వెల్లడించడానికి ఈ పత్రిక ఒక వేదిక కావాలని అభిప్రాయపడ్డారు.

అలాగే ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకురావడంతో పాటూ వాటి పరిష్కారానికి ఈ పత్రిక తోడ్పడాలని ఆకాంక్షించారు.

ఇక పత్రిక స్వరూప స్వభావాలు, ఎటువంటి శీర్షికలు ఉండాలో నిర్ణయించడానకి ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. పత్రిక తొలి ప్రతిని సెప్టెంబర్‌లో విడుదల చేస్తామన్నారు.

పత్రిక ఈ మ్యాగజైన్‌తో పాటు ముద్రిత సంచికను కూడా కార్యకర్తలకు అందుబాటలో ఉంచుతామన్నారు. అలాగే జనసేన పార్టీ కొత్త అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

జ‌న‌సేన పార్టీ తీర్మానం
ఏపీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షలు మొదలు పెట్టింది జనసేన పార్టీ. ఎన్నికల ఫలితాల తర్వాత గురువారం (జూన్ 6) తొలిసారి విజయవాడకు చేరుకున్న అధినేత పవన్ కళ్యాణ్.

పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహించారు.. పార్టీ ఓటమిపై చర్చించారు.

సమీక్షల్లో భాగంగా పవన్ తొలిరోజు కృష్ణా, ప.గో జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించారు.

సమీక్షా సమావేశంలో పవన్‌‌తో పాటూ సోదరుడు, నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిన నాగబాబు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సమీక్షలో ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఓటమిపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణతో పాటూ పార్టీ బలోపేతంపై చర్చించారు.

గ్రామస్థాయి నుంచి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు.. స్థానికసంస్థల ఎన్నికల వ్యూహాలపైనా చర్చించారు.

13 జిల్లాలో నేతలతో పార్టీ ఓటమి, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *