డల్లాస్ సభలో జరిగిన తప్పులకు బాధ్యులు ఎవరు?

జననేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు రాక రాక మొట్టమొదటిసారిగా అమెరికా వచ్చారు. అదీ సీఎం హోదాలో. సభకి జనం బాగానే వచ్చారు, భోజనాలు బాగానే పెట్టారు. జగన్ గారి స్పీచ్ అదరహో. జనం, ఫుడ్, స్పీచ్ విషయంలో నూటికి నూరు మార్కులు.

ఈ మూడు తప్ప మిగిలిన విషయాలలో ఆర్గనైజర్లు పూర్తి స్థాయిలో విఫలం అయ్యారు. నాయకత్వం అనేది ఎప్పుడు ఒకరే చెయ్యాలి. ఒకే పనికి పది మంది నాయకులు ఉంటె ఫలితం ఎలా ఉంటుందో చూశాం. గత పదేళ్లుగా అమెరికాలో పార్టీ కోసం కష్టపడిన వారిని ఒక్కరిని కూడా జగన్ గారిని కలిసే భాగ్యం కలిగించకుండా చేసారు. పార్టీ ఫండ్స్ ఇచ్చినవారిని కూడా కలవకుండా చేసారు.

కమ్యూనిటీ పెద్దలకు తీవ్రమైన అవమానం జరిగింది. ఉదాహరణకు, జగన్ గారు కాసేపు ఉన్న హోటల్ సూట్ దగ్గర లక్కిరెడ్డి హనిమిరెడ్డి గారు ఒక గంట సేపు నిలబడి వేచిఉన్నారు. అయన వయసు 70. అక్కడే తిరుగుతున్న మహిళా ఎన్నారై కన్వీనర్ ఆయననుచూసి కూడా పట్టించుకోకుండా ఆమె చుట్టాలను లోపలకి తీసుకువెళ్లారు.

పార్టీకోసం కష్టపడినవాళ్ళని కాదని ఎవరెవరినో లోపలికి తీసుకువెళ్లి జగన్ గారిని కలిపించారు. స్టేజి మీద లక్కిరెడ్డి గారికి కుర్చీ వేసి కూర్చోబెట్టి, మళ్ళీ ఆయనను లేపి, కుర్చీ తీసివేసి ఆయనను స్టేజి కి ఒక్క పక్క నిలబెట్టారు దాదాపు గంట పాటు. తరవాత ఆయన అక్కడినుండి వెళ్లిపోయారు. తెలుగుపెద్ద అయినా పైళ్ల మల్లారెడ్డి గారికి జనరల్ సీటింగ్ లో ఎవరో లేచి కుర్చీ ఇస్తే కూర్చున్నారు.

ఆటా హనుమంతరెడ్డి గారి పరిస్థితి కూడా ఇదే. చిన్న పెద్ద తెలుగు కమ్యూనిటీ నాయకులూ మొత్తం తీవ్రమైన నిరాశకు గురై, అసహనం, కోపం వ్యక్తం చేసారు. ఇది మన ఆర్గనైజర్ల పనితనం. నేటి అమెరికా కుర్ర నాయకులకు పెద్దలంటే గౌరవం ఏమాత్రం లేదు. అమెరికాకి ఐదుగురు కన్వెనేర్లు.

వీళ్ళు కాక ఇటీవల ఒక కీలక పదవి చేపట్టిన ఆకేపాటి వెంకన్న నాయకత్వం( ఇతను అస్సలు పనికిరాడు, డిజాస్టర్ కాండిడేట్), ఇండియా నుండి వచ్చిన చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే, అందరూ కలసి హడావుడి చేసి చాలా దరిద్రంగా ఆర్గనైజ్ చేసారు. వీళ్ళందరికీ ఇండియా నుండి సూచన చేసి,ఈ విధంగా అందరిని అవమాన పడేలా చేసిన ఘనత మాత్రం, పార్టీలో నెంబర్ 2 అయిన రాజ్యసభ సభ్యునికి చెందుతుంది.

అయన సూచన మేరకే పైన చెప్పిన వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. హుందా తనం కోల్పోయి, పిల్ల చేష్టలుగా చేసారు. ఎన్నారై కమిటీలో ఉన్న సభ్యలకు ఒక పద్దతి ప్రకారం ట్యాగ్ లు ఇవ్వలేదు. అసలు ఏ ట్యాగ్ , ఎక్కడ ఇస్తున్నారో, ఎవరు ఇస్తున్నారో తెలియదు. వీవీఐపీ ట్యాగ్ లకు వైట్ కలర్ పెట్టారు.

జనాలు Walmartకి వెళ్లి వైట్ కలర్ ట్యాగ్ లు తెచ్చుకున్నారు. 25 ట్యాగ్ లకోసం, రెండు రోజులు ప్రేమ్ రెడ్డి గారితో గొడవ పడ్డారు ఆర్గనైజర్లు. చివరికి 500 మంది దగ్గర వీవీఐపీ ట్యాగ్ లు ఉన్నాయి. 10 లక్షల పైన డొనేట్ చేసిన వారికి ఫోటో అన్నారు, చివరికి ఏమీ లేదు.

వందల డాలర్లు ఖర్చు పెట్టుకొని దేశం నలుమూలలనుండి వచ్చిన అభిమానులు, పార్టీ కోసం పని చేసిన వాళ్ళు లోలోపల కుతకుత లాడిపోతున్నారు.

చాలా మంది పడ్డ బాధను చూసి ఈ లేఖ అనామక ద్వారా ఇమెయిల్ చేయబడింది. నూటికి నూరు శాతం జగన్ గారు చదువుతారు. మీకు బుద్ది చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *