అమరావతి కి మకాం మార్చనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్

వైకాపా అధినేత జగన్ త్వరలో తన మకాంను అమరావతికి మార్చనున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ కోసం నూతన నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. వచ్చే నెల 14న జగన్ కుటుంబ సమేతంగా నూతన గృహంలో గృహ ప్రవేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు హైదరాబాద్లోని నివాసం ఉంటున్నారు. దాంతో వైకాపా ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉన్నది. ఇప్పుడు జగన్ తన మకాంను నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మార్చడంతో పార్టీ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడకు తరలి రావడం ఖాయమని అంటున్నారు. జగన్ అమరావతిలో నిర్మించుకున్న నూతన గృహంలో ను పార్టీ కార్యాలయంలో నిర్మాణము చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మకాం మార్చారు.

ఆయన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు వారిద్దరి బాటలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా తన మకాంను హైదరాబాద్ నుండి అమరావతికి మార్చనున్నారు. ఎన్నికలు దగ్గర కావడంతో అన్నింటికీ ఉపయోగకరంగా ఉంటుందని. పార్టీ కార్యకర్తలకు పార్టీ సమావేశాలకు ఎంతో అనువుగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *