రాష్ట్రమంతటా త్వరలో జగన్ బస్సు యాత్ర

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన రెండు రోజుల్లోనే లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని తెలిపారు.
గురువారం హైదరాబాద్లో లోటస్పాండ్లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ,పార్టీ రాజకీయ విశ్లేషకుడు, ప్రశాంత్ కిషోర్, నేతలు ధర్మాన ప్రసాదరావు, కరుణాకర్రెడ్డి, రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీకోసం పనిచేస్తున్న వారిని గుర్తించాలని సమన్వయకర్తలను జగన్ ఆదేశించారు, 13 లోక్సభ నియోజకవర్గాలు కొత్త పరిశీలకులను నియమించాలని చెప్పారు.
రెండు అసెంబ్లీ స్థానాలకు ఒక్కొక్కరు చెప్పిన పరిశీలిస్తామన్నారు, సమర్థులకే ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగిస్తాం.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించడం మీ బాధ్యత.
వచ్చే 45 రోజులు అత్యంత కీలకం, త్యాగాలు చేయండి ,కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి, ఏపీలో వ్యవస్థలు బతకాలంటే వైసీపీ గెలుపు ఒక్కటే మార్గం అని జగన్ పేర్కొన్నారు.