కెనడాలో జగన్ పుట్టినరోజు వేడుకలు

YS Jagan Birthday Celebrations 2018 Canada
కెనడాలో YSR “NRI FANS” జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కెనడాలో శుక్రవారం వర్కింగ్ డే అయినప్పటికీ అక్కడ ఉన్న NRI లు వైఎస్సార్సీపీ మరియు జగన్ పై ఉన్న అభిమానంతో వారికి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఒక పండుగ వాతావరణం సృష్టించారు.
కెనడాలో శుక్రవారం సాయంత్రం 7 గంటలకు జరిగిన ఆ పుట్టిన రోజు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు రోజా సెల్వమణి గారు, MLC ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,
EX-MINISTER బొత్స సత్యనారాయణ, EX-MP వై.వి.సుబ్బారెడ్డి ప్రత్యక్ష వీడియో ప్రదర్శనలో హాజరయ్యారు. వీరే కాకుండా కెనడా లో ఉంటున్న ప్రముఖులు “భూషణ్ వెంకటాపురం” “హేమంత్ దందోలు” “వేణుగోపాల్ చుక్కలూరి” “సుబ్రహ్మణ్యం రెడ్డివారి” “అస్లాం బైగ్” “కృష్ణారెడ్డి పసల” “డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిస ” వీరందరూ అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
కెనడాలో ఉన్న ఇతర ప్రాంతాలు అయిన Montreal and Calgary లోను జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కెనడాలోని ప్రవాసాంధ్రులు ఘనంగా జరిపారు కెనడా వైసీపీ ఎన్నారై సభ్యులు సహచరులతో కలిసి కేక్ కట్ చేసి అంబరాన్ని తాకేటట్టు సంబరాలు చేసుకున్నారు. తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కెనడా ఎన్నారై విభాగపు సభ్యులు పేర్కొన్నారు.
డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా జననేతకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కెనడా వైసీపీ ఎన్నారై విభాగపు సభ్యులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రి చేసేందుకు ఎన్నారైలు తమ తమ నియోజకవర్గల్లో పార్టీ కార్యక్రమాల్లో సహయ, సహకారాలు అందించాలని కోరారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే అది ఒక వైఎస్ జగన్ వల్లే సాధ్యమన్నారు. తప్పకుండా మనమందరం కలిసి రాష్ట్రంలో అన్ని కులాలకు,మతాలకు మేలుచేసిన నాయకుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ గెలుపు కొసం దేవుడిని కోరుకుంటూ , అలానే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రచార కార్యక్రమాలను విసృతంగా జరపాలని కొరారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను వైఎస్సార్‌సీపీ తరఫున గెలిపించుకోని రాష్ట్రంలో మరలా రాజన్న స్వర్ణయుగ పాలన సాధించుకుందామన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను నాలుగున్నరేళ్ళుగా మోసం చేసిన చంద్రబాబును రాష్ట్రంలో ఉన్న ఏ వర్గం ప్రజలు క్షమించరని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సంజీవనైనా ప్రత్యేకహోదా జగన్ ద్వారానే సాధ్యమని, కాబట్టి రాష్ట్ర ప్రజానికం ఆలోచించి విజ్ఞతతో ఓటేయాలని సూచించారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం చేస్తున్నా నక్కజిత్తుల రాజకీయాలను గ్రహించి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అని కెనడా వైసీపీ NRI విభాగం సభ్యులు కోరారు. వైస్సార్, వైఎస్ఆర్సీపీ కెనడా మరియు జగన్ అభిమానులు దాదాపు 65 మంది పాల్గొన్నారు.