ఏపీ ఎన్నికల్లో గెలుపెవరిదనే విషయం ఆసక్తికరంగా మారింది…

అధికార టీడీపీ మళ్లీ గెలవనుందా? వైస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయో వివరాలు మీకోసం.

ఏపీ ఎన్నికల్లో గెలుపెవరిదనే విషయం ఆసక్తికరంగా మారింది.
అధికార టీడీపీ మళ్లీ గెలవనుందా? వైస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా?

సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తి ఎదురు చూస్తోన్న తరుణంలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి.

అయితే, ఏపీ ఫలితాలపై ఒక్కో సంస్థ ఒక్కోలా అంచనావేశాయి. మెజార్టీ సంస్థలు మాత్రం వైసీపీకి అధికారం దక్కుతుందని తెలిపాయి.

మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు ఏమేరకు నిజమవుతాయో తెలిపోనుంది.

గతంలో స్వల్ప తేడాతో అధికారానికి దూరమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుపు తమదేననే ధీమాతో ఉంది. టీడీపీ కూడా గెలుపు తమదేననే నమ్మకంతో ఉంది.

ఏపీలో 175 శాసన సభ స్థానాలు ఉండగా.. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి 106 అసెంబ్లీ స్థానాల్లో, వైఎస్ఆర్సీపీ 68 స్థానాల్లో గెలుపొందాయి.

ఈ దఫా ఎన్నికల్లో 2118 మంది అభ్యర్థులు ఏపీ అసెంబ్లీ బరిలో నిలిచారు. ఏపీ ఎన్నికల్లో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైంది.

కేంద్రంలో బీజేపీకి అధికారాన్ని దూరం చేసే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా? ఏపీకి సీఎంగా తిరిగి ఎన్నికవుతారా? లేదంటే జగన్ హవా ఉండనుందా..?

2014 ఎన్నికలు ముగిశాక వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. లగడపాటి సర్వే టీడీపీ కూటమి గెలుస్తుందని అంచనా వేసింది.

సీపీఎస్ సర్వే టీడీపీ: 43-44, వైసీపీ: 130-133, జనసేన: 0-1

వీడీపీ సర్వే టీడీపీ: 54-60, వైసీపీ: 111-121, జనసేన : 0-4

ఏపీ ఎన్నికలపై లగడపాటి సర్వే వివరాలివే..

  • 2019 ఏపీ ఎన్నికల్లో టీడీపీకి 100 స్థానాలకు పది సీట్లు అటు ఇటుగా వస్తాయని లగడపాటి సర్వే అంచనా వేసింది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఆర్జీ ప్లాష్ సర్వే అభిప్రాయపడింది.
  • జగన్ పార్టీకి ఏడు స్థానాలు అటు ఇటుగా 72 సీట్లు వస్తాయని లగడపాటి సర్వే అభిప్రాయపడింది. ఇతరులు 3 నుంచి 5 స్థానాలకు పరిమితం అవుతుందని పేర్కొంది.జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ 18 నుంచి 20 ఎంపీ సీట్లు గెలుపొందుతుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌ సూచించాయి.
  • టీడీపీకి ఆరు సీట్లు వస్తాయని అభిప్రాయపడింది.ఏపీలోని లోక్ సభ స్థానాలను పరిగణనలోకి తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి 48 శాతం, టీడీపీకి 30.8 శాతం, కాంగ్రెస్ 3.2 శాతం, బీజేపీకి 6.7 శాతం, ఇతరులు 11.3 శాతం ఓట్లను దక్కించుకుంటాయని టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే అంచనా వేసింది. టీడీపీకి 7, వైసీపీకి 18 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ అభిప్రాయపడింది.

న్యూస్ 24- టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం టీడీపీ 17 (± 3), వైఎస్ఆర్సీపీ 8 17 (± 3) లోక్ సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.

న్యూస్ 18- ఐపీఎస్ఓఎస్ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం టీడీపీ 10 నుంచి 12 చోట్ల, వైఎస్ఆర్సీపీ 13-14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.

ఐఎన్ఎస్-సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం టీడీపీకి 14 లోక్‌సభ స్థానాలు, వైఎస్ఆర్సీపీ 11 లోక్‌సభ స్థానాలు వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed