రక్తం పొంగి ఏరులై పారడానికి నాలుగున్నర ఏళ్లు పట్టింది

నా ఇష్టం నాది అంటూ వరసగా సెటైరిక్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు నాగబాబు, ఈసారి ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నే టార్గెట్ చేసుకున్నారు నాగబాబు.

రక్తం పొంగి పోతోందంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై సెటైరిక్ గా స్పందించారు నాగబాబు.

అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ నేతలపై భగ్గుమంటున్న చంద్రబాబు… రక్తం పొంగి పోతుంది అంటూ వ్యాఖ్యానించారు. దీని పై నాగబాబు స్పందించారు..

“పాలు పొంగడం నికి నాలుగున్నర నిమిషాలు పట్టింది చంద్రబాబు రాకపోవడానికి నాలుగున్నర ఏళ్లు సమయం పట్టింది. ఎక్కువ మంట పెడితేనే పాలు మరుగుతాయి విషయం మనందరికీ తెలిసిందే. ఎలక్షన్లు వస్తేనేగాని మన చంద్రబాబు నాయుడికి రక్తం మరుగుతుంది మరి”

ఇలా చంద్రబాబుపై వరసగా విమర్శలు చేస్తున్నారు నాగబాబు.

కానీ ఇప్పటివరకు బాబు ను టార్గెట్ చేయలేదు. బాబు కామెంట్స్ పై నాగబాబు వీడియో పెట్టడం ఇదే ఫస్ట్ టైం.

ఏబీఎన్ రాధాకృష్ణ పై నేరుగా విమర్శలు చేస్తున్న నాగబాబు…. కాపీరైట్ ఇష్యూస్ కారణంగా ఆ వీడియో ను తొలగించారు.

ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ అసెంబ్లీలో అతడు ప్రసంగించిన క్లిప్పింగ్ వీడియోను పోస్ట్ చేశారు. మరి ఈ వీడియో అయినా ఉంటుందో ఊడుతుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *