ఐటీ గ్రిడ్ సంస్థ చైర్మన్ పరార్… వైసిపి కమిటీ మెంబర్ల డేటా ..సాక్షి చందాదారుల జాబితాలు… లీక్…

తమ సమాచారం చోరీకి గురి అయినట్లు తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతూ ఉంది. ఇదంతా ఎదురుదాడి, బుకాయించడం మాత్రమే.. ఐటీగ్రిడ్స్ అనే సంస్థ ను నుంచి డేటాలో ఉన్న సమాచారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కాదు.. రాష్ట్ర ప్రజలది అని పోలీసులు ధ్రువీకరిస్తూ ఉన్నారు.

ఏపీ ప్రజలకు సంబంధించిన డేటా ఐటీ గ్రిడ్స్ వద్ద పట్టుబడినట్టుగా పోలీసులు వివరన ఇచ్చారు.

ఐటీ గ్రిడ్ సంస్థ చైర్మన్ అశోక్ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా అని చెబుతున్నారు. అతడిని లొంగిపోవాలని పోలీసులు కోరారు కూడా. అయితే అతడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఇప్పటివరకూ అతడి జాడ కనపడటం లేదు. ఒకవేళ ఏ తప్పూ చేయకపోయి ఉంటే.. అతడు ఎందుకు పరార్ కావాల్సి ఉంది అనే ప్రశ్న మొదలైంది.

అతడిని టిడిపి పార్టీ వాళ్లే కాపాడుతూ ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏపీ ప్రజల డేటాను చోరీ చేసిన సంస్థ తరఫున ఏపీ ముఖ్యమంత్రే వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతూ ఉన్నప్పుడు.. అతడిని ఏపీలో ఉంచి కాపాడుకోవడం పెద్ద విషయం కాదు అని పరిశీలకులు అంటున్నారు.

ఐటీ గ్రిడ్స్ వద్ద సమాచారం ఏమిటి? ఆ డేటాలో ఏముంది? అనే అంశం గురించి ఆశ్చర్యకరమైన వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి.

ఆ డేటాను నిపుణులతో డీకోడ్ చేయిస్తూ ఉన్నారు తెలంగాణ పోలీసులు. ఈ అంశం గురించి బీజేపీ ఎంపీ జీవీఎల్ మరో ఆసక్తిదాయకమైన విషయాన్ని బయట పెట్టారు.

ఆ డేటాలో సాక్షి పత్రిక చందాదారుల జాబితాను కూడా ప్రత్యేకంగా తయారు చేశారని అయన చెప్పారు! ఏపీలో సాక్షి పేపర్ ను వేయించుకుంటున్న వారి లిస్టునంతా ప్రత్యేకంగా పేర్కొన్నారట. సాక్షి పేపర్ ను వేయించుకుంటున్నారు అంటే.. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అయి ఉండవచ్చనే లెక్కతో ఆ జాబితాను తయారు చేశారని స్పష్టం అవుతోంది. అలాంటి వారి ఓట్ల తొలగింపుకు రెడీ అయ్యినట్టే అనుకోవాలి మరి..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్త సమాచారం ఐటీ గ్రిడ్స్ చేతిలో ఉందట! ఆ పార్టీ నేతల చిట్టానే కాదు.

ఏపీలో ఏ నియోజకవర్గంలో వైసీపీకి ఎన్ని బూత్ కమిటీలు ఉన్నాయి, వాటిలో సభ్యులు ఎంత మంది ఉన్నారు? ఆ సభ్యుల ఫోన్ నంబర్లు ఏవి? ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వాళ్లు ఎవరెవరు? అనే జాతాకాలు అన్నీ ఐటీ గ్రిడ్స్ వద్ద దొరికిన డేటాలో నిక్షిప్తం అయి ఉన్నాయని సమాచారం.

ఇదంతా చూస్తుంటే.. తెలుగుదేశం పార్టీ కసరత్తు ఏ రేంజ్ లో ఉందో.. ఏపీ ప్రజల జాతకాలను ఎలా చేతిలో పెట్టుకుందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *