త్వరలో మీడియా ముందుకు రాబోతున్న శిఖ చౌదరి తల్లి.. వెలుగులోకి ఏమేమి రాబోతున్నాయో?

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ప్రముఖ ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో గంటగంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది.
ఈ విషయం పై శిఖా చౌదరి తల్లి త్వరలో మీడియా ముందుకొస్తా.. అన్ని వివరాలు వెల్లడిస్తా.. అంటుంది
ఇప్పటికే ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి అని తేల్చిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యలో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి పాత్ర ఉన్నట్లు ఆధారాల్లేవని కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠీ మీడియాకు వివరించారు. అయితే ఈ తరుణంలో జయరామ్ సతీమణి పద్మశ్రీ.. శిఖాపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి!

మీడియా ముందుకొస్తా.. ఈ వ్యవహారంపై స్పందించాలని శిఖా చౌదరి తల్లి సుశీలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంప్రదించింది. అయితే ఆమె మాత్రం ఈ కేసు విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. త్వరలోనే తాను మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు వివరిస్తానని స్పష్టం చేశారు.
జయరామ్ హత్యకేసులో నిందితురాలిగా భావిస్తున్న శిఖా చౌదరి స్వస్థలం విజయవాడ. ఆమె తల్లి సుశీల విజయవాడకు సమీపంలోని కానూరులోనే నివాసం ఉంటున్నారు.
అయితే.. త్వరలోనే మీడియా ముందుకు వస్తానంటున్న సుశీల ఏం చెప్పబోతున్నారు..? ఆమె కుమార్తెపై వచ్చిన ఆరోపణలపై ఎలా రియాక్టవుతారు..? పద్మశ్రీ వ్యాఖ్యలపై సుశీల ఏం మాట్లాడబోతున్నారు..? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. 2016 నుంచే ప్రాణహాని ఉందని.. ఆయన సొంత సోదరే చంపాలని చూశారని పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.