జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా?

విజయవాడ: ఇదివరకూ ఈ విషయం పై పవన్ ప్రకటన చేశాడు. తను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తున్నట్టుగా పవన్ ప్రకటించాడు.

సినిమాల్లో ఈ హీరోలు చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటారు. ఏం చెబితే అదే చేస్తారు. అయితే నిజ జీవితంలో వీళ్ల రాజకీయంలో మాత్రం అంత సీన్ లేదు.

పవన్ కళ్యాణ్ కూడా అందుకు మినహాయింపు కాదు. గత ఎన్నికల ముందు పవన్ చెప్పిన మాటలకూ.. ఆ తరువాత వ్యవహరించిన తీరుకు పొంతనలేదు.

అలాగే అనంతపురం నుంచి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించిన పవన్ ఇప్పుడు ఆ మాటనూ నిలబెట్టుకునేలా లేడు.

అనంతపురాన్ని ఉద్ధరించేందుకు అక్కడ నుంచి పోటీ అని చెప్పిన పవన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తను పరువు పోగొట్టుకోకుండా.. కుల సమీకరణాలు అనుకూలంగా ఉండే సీటును వెదుక్కొంటున్నాడని ప్రచారం జరుగుతూ ఉంది.

తన పార్టీ ఖాయంగా గెలిచే ఎమ్మెల్యే సీటును పవన్ వెదుక్కొంటున్నట్టుగా తెలుస్తొంది.ఆ అన్వేషణలో ఏ సీటు తెలుతుందో.. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో చూడాల్సి ఉంది.

ఒకవేళ పవన్ ఆఖరి నిమిషంలో ఎన్నికల బరిలోం చి తప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

అంటే తను ఎన్నికల బరి నుంచి తప్పుకున్నా , తన పార్టీనే ఎన్నికల బరి నుంచి తప్పించినా పెద్దగా ఆశ్చర్యాలు ఉండవు.

ఇప్పటివరకూ పవన్ తీరులో ఎంతో మార్పు ఉంది. రేపు కూడా అవేమార్పులే జరగవచ్చు. పవన్ టార్గెట్ ప్రస్తుత ఎన్నికలు కాదని, 2024 ఎన్నికలు అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ- వైసిపి తలపడితే. ఒక పార్టీ గెలిచి మరోటి ఓడితే.. ఓడిపోయే పార్టీ స్థానాన్ని తను ఆక్రమించాలనేది పవన్ లెక్క అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పటికే పవన్ అభ్యర్థులను కూడా ప్రకటించేశాడు.

కాబట్టి జనసేన బరిలో ఉంటున్నట్టే. ఇంతకీ పవన్ పోటీ చేస్తాడా లేక తను రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలి కాబట్టి తాను పోటీ చేయనట్టుగా ప్రకటిస్తాడా? అనేది వేచి చూడాల్సిన అంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *