డబ్బులేని ఎన్నికలా


డబ్బున్న వాళ్ళకే జగన్ టికెట్లు ఇస్తున్నాడు.. అంటూ చెప్పుకొచ్చాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొన్నాళ్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేసి బయటకు వచ్చే వాళ్లు చెప్పేమాటనే చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నాడు.

జగన్ డబ్బున్న వాళ్ళకే ప్రాధాన్యతను ఇస్తున్నాడంటూ బాబు ఆక్రోశిస్తూ ఉన్నాడు. కొంపదీసి చంద్రబాబు కూడా వైకాపా టికెట్ ఏమైనా ఆశిస్తున్నాడు..

అనే డౌట్ రావొచ్చు బాబు నుంచి ఈ మాటలు వింటే. అయినా.. రాజకీయాల్లో డబ్బు గురించి చంద్రబాబు మాట్లాడటమే కామెడీ.

తెలుగుదేశం టికెట్లను బికారీలకు , అడుక్కు తినేవాళ్లకు, నిరుపేదలకు ఇస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ నేతల, ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న వారి ఆర్థిక శక్తి ఏమిటో ఎక్కడిక్కడ ప్రజలకు తెలుసు.

తమ తమ నియోజకవర్గాల అధికార పార్టీ నేతలు వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని.. ప్రతి నియోజకవర్గంలోనూ ఒకే టాక్ వినిపిస్తోంది.


తమ సంపాదన వివరాలను మంత్రి ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్లు ఓపెన్ గానే చెప్పారు కూడా, ప్రతి రూపాయలోనూ వాటలు అని.. అధికార పార్టీ నేతలుగా పంచుకుంటున్నట్లుగా ఆ మధ్య అది స్వయంగా వివరించారు కూడా.

జేసీ దివాకర్ రెడ్డి ఒక నిరుపేద, గల్లా జయదేవ్ మరో నిరుపేద , ఇంకా సీఎం రమేష్, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డి, కాలువ శ్రీనివాసులు , దవినేని ఉమ.. వీళ్లంతా తెలుగుదేశం పార్టీ నిరుపేదలు. జగన్ డబ్బున్న వాళ్లకే టికెట్లు ఇస్తూ ఉంటే..

చంద్రబాబు మాత్రం బీపీఎల్ సర్వేలో దారిద్ర్యరేఖ దిగువన ఉన్న వాళ్లను ఎంపిక చేసి టికెట్ ఇస్తున్నాడు? ఇలా ఉంది బాబు కామెడీ, ఇక జగన్ అమరావతిలో ఇప్పుడే కాపురం పెడుతున్నాడని చంద్రబాబు అనడం మరో ప్రహసనం.

జగన్ హైదరాబాద్ లో నివాసం ఉన్నాడన్న మాటేకానీ. ఏదో ఒక యాత్రంటూ ఐదేళ్ల నుంచి జనాల మధ్యన ఉంటున్న విషయం వాస్తవం కాదా?

ఇంతకీ చంద్రబాబునాయుడు ఫ్యామిలీ ఎక్కడ కాపురం ఉంటోంది? హైదరాబాదులో కాదా? ఏపీ ప్రభుత్వ సొమ్ముతో.. రెంట్లు కట్టించి..

హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్లో బాబు కుటుంబం నివాసం ఉండ లేదా?

ఇటీవలే అందుకు సంబంధించిన సమాచారం కూడా ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చింది కదా!


సోలో గా పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ఖర్చు అంతా చంద్రబాబు నాయుడు పెట్టుకుంటాడనే హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

నియోజకవర్గానికి ఐదారు కోట్ల రూపాయలు వరకూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖర్చుపెట్టడానికి చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారు పొత్తు ఉండాలని గట్టిగా చెప్పామని..

అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే వాళ్లకు ఆర్థిక అండదండలు ఇచ్చేందుకు మాత్రం చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.

చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకున్నట్టుగా..

అందుకు సమ్మతించాల్సి వచ్చిందని సమాచారం ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు సాంప్రదాయబద్ధంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వర్గాలవే.

కాంగ్రెస్ బలంగా నిలబడకపోతే ఆ ఓట్లు సూటిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోతాయి.

అందుకే కాంగ్రెస్ బరిలోనిలపడం, అది కూడా ఖర్చు పెట్టించడం ద్వారా ఓట్లు చిలికి తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడి వ్యూహం హైదరాబాదులో నివాసం ఉండటానికి,

అక్కడ ఇంటి రిపేర్లకు చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్న మొత్తాల మేటేమిటి?

రాజకీయ నేతలు మాట్లాడొచ్చు కానీ.. మరీ అన్యాయంగా, దారుణంగా మాట్లాడకూడదు. ప్రజలకు ఏమీ తెలియదు..

అన్నీ తాము చెప్పిన మాటలనే నమ్మేస్తున్నారనే భ్రమలో నేతలు బతికితే అంతే సంగతులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *