బయోపిక్ లు రాజకీయాలని మారుస్తాయా

ఎన్నికలు దగ్గర పడే నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. చేరికలు, విమర్శలకు తోడు… కొత్తగా ఇప్పుడు సినిమాలు కూడా తీస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు.

అలాగే యాత్ర పేరుతో వైఎస్ బయోపిక్ ని విడుదల చేశారు. అలాగే వైసిపి లీడర్లు నిర్మాతలుగా… వర్మ దర్శకత్వంలో మరో బయోపిక్ సిద్ధం చేస్తున్నారు… మరి ఈ బయోపిక్ లకు ఓట్లు వస్తాయో లేదో తెలియదు…

బయోపిక్ లో చూసి ప్రజలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారా …

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినీతారలు ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది. తెలుగు ప్రజలు నిత్య జీవితంలో సినిమా ఒక భాగం.

అందుకే నటులకు అంత క్రేజ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది… అక్కడ అభిమాన సంఘాలు యాక్టివ్ గా ఉంటారు.

సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనుకున్నంత మాత్రాన.. రాష్ట్ర రాజకీయాల్లో విజయం సాధిస్తారని అంచనాలు ఎప్పుడూ లేదు. తెలుగునాట ఎన్టీఆర్, తమిళనాట ఎంజీఆర్ మాత్రమే ఆ విజయాన్ని సాధించ గలిగారు.

ఆ తర్వాత కాలంలో సూపర్ స్టార్ లుగా మారిన ఎన్నో రాజకీయాల్లో విఫలమయ్యారు. చిరంజీవి కూడా ఈ రూట్లో సక్సెస్ సాధించలేకపోయారు.

సినిమాలు వారి బయోపిక్ లో ఓట్లు వస్తాయో లేదు… అంటే సాధ్యం కాదనే చెప్పుకోవాలి..

ఇలాంటి వారంతా ప్రజల ముందు ఉన్న వారే వారి జీవితాలు అందరికీ తెలిసినవే. రాజకీయాల్లో విజయం సాధించాలంటే పరిస్థితులు కూడా కలిసి రావాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ సినీ నటుడిగా ఉన్న తన ఇమేజ్ తోనే రాజకీయాల్లో విజయం సాధించలేదు..

నాడు ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి.అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాం పట్ల వ్యతిరేకత అలాంటిది. అప్పట్లో ప్రతిపక్షాలకు అంత బలంగా లేవు…ఆ సమయంలో అన్ని స్థానాలకు పోటీ చేయగలిగే స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయగలిగారు అందుకే ప్రజలు ఆదరించారు.

రాజకీయ కోణంలో జీవిత చరిత్రలు స్ఫూర్తి దాయకం అవుతాయా..

సాధారణంగా బయోపిక్ లో ఎందుకు తీస్తారు అంటే యువత అవి స్ఫూర్తిగా తీసుకుంటారని… కానీ ఇప్పుడు అన్ని పొలిటికల్ మోటివేట్ బయోపిక్ లే తీస్తున్నారు.

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమాను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుటుంబం చేతిలో ఉందని ఈ బయోపిక్ ద్వారా చెప్పాలని ప్రయత్నం చేశారు.

ఈ సినిమా చూస్తేనే ప్రజలు, సోనియా, రాహుల్ అన్యాయం చేశారని తెలుసుకున్నారా అంటే అదేమీ లేదు కదా.. ఇప్పుడు తెలుగులో వస్తున్న బయోపిక్ లో ద్వారా తెలుస్తున్నది కూడా అదే..

యాత్ర బయోపిక్ ద్వారా వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి కొత్తగా చెప్పిందేమీ లేదు.. ఆయన పాదయాత్ర గురించి అందరికీ తెలిసిన విషయమే.. ఆయన సంక్షేమ పథకాల గురించి మనందరికీ తెలుసు.

కొత్తగా చెబితే తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా లేదు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ కలిసి వచ్చింది. వైయస్ మరణం తర్వాత ఆయనకు సహజంగానే సానుభూతి వచ్చింది.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అందరూ జగన్మోహన్రెడ్డిని పోటీపడి తమ నేతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కానీ హైకమాండ్ మాత్రం జగన్ కు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ప్రజల్లోనూ సానుభూతి మరింత పెరిగింది. అలాగని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైయస్ ఫ్యాక్టర్ మీదే ఉన్నారని చెప్పడానికి లేదు.

రాజకీయ రణరంగంలో బయోపిక్ లకు హవా…

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధపడటం లేదు. ఆ సమయంలో టిడిపి పార్టీకి ప్రతిపక్షంగా జగన్ ఉన్నారు. అందుకే నేతలు కొంతమంది ఆయన వైపు చేరారు.

రాజశేఖర్ రెడ్డి పట్ల గౌరవం అభిమానం ఉన్న ఓటర్లు కాదు టిడిపిని వ్యతిరేకించేవారు కూడా వేరే ప్లాట్ ఫామ్ లేదు. అందుకే అందరూ వైసీపీ వైపు చేరుతున్నారు.

టిడిపిలో చోటు లేని వాళ్ళు చంద్రబాబును వ్యతిరేకించేవాళ్ళు టీడీపీ ని ఓడించాలి అనుకునేవాళ్ళు ప్రతిపక్షంగా ఉన్న వైసిపి వద్దకు వెళుతున్నారు.

అక్కడ ప్లేస్ లేకపోతే జనసేన కు వెళ్తున్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్ల జగన్ నిలబడటం లేదు అందుకే బయోపిక్ ద్వారా ఓట్లు వస్తాయని ఆశించడం లేదు. కొత్త విషయాలేవీ బయోపిక్ ల ద్వారా చెప్పడం లేదు.

ఈ సినిమాలు చూసిన ప్రజలు భావోద్వేగాలకు గురై ఓట్లు వేస్తారని చెప్పలేము. కానీ ఈ బయోపిక్ ల ద్వారా కాస్తయినా ప్రభావం ఉంటుంది కదా… కానీ అవి నిర్ణయాత్మకంగా ఉంటుందని చెప్పలేం. ఎంతో కొంత ప్రభావం ఉంటుందని ఆశ తో బయోపిక్ తీస్తున్నారు.

తమ బ్రాండ్ అని అనుకుంటారో దాన్ని పాజిటివ్గా ప్రచారం చేసేందుకు… తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై నిందలు వేసేందుకు… బయోపిక్ ల రూపంలో తెరకెక్కిస్తున్నారు…వీటిని ప్రజలు ఆటలో ఒక భాగంగా అని అనుకుంటున్నారు తప్ప సీరియస్గా తీసుకునే అవకాశాలు లేవు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *