రెబల్ స్టార్ కృష్ణంరాజు గవర్నర్ గా రాబోతున్నారా?….. బాహుబలి ప్రభాస్ రాజకీయ ప్రవేశం చేయబోతున్నారా?…..

2014 లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కృష్ణం రాజున గవర్నర్ అవుతారు అనే పుకారు చాలాసార్లు తెరపైకి వచ్చింది. అయితే వివిధ రాష్ట్రాల గవర్నర్ పదవులను నియమించినప్పుడు మాత్రం కృష్ణం రాజు పేరు కనిపించలేదు.
అయితే ఇప్పుడు తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని గవర్నర్ల పదవీకాలం త్వరలోనే ముగుస్తున్న సందర్భంలో మళ్లీ కృష్ణంరాజు పేరు వార్తల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలలో ప్రభాస్ ను రంగంలోకి తేవాలని బిజెపి యోచిస్తోంది.
ఇప్పటివరకు ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి తీసుకు వెళ్ళగలిగే స్టార్లు లేకపోవడంతో బాహుబలి ప్రభాస్ ను రాజకీయాల్లోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తోంది.
అన్ని రాష్ట్రాల లోని కమలనాథులకు సినిమా వాళ్ళ సపోర్ట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంతంతమాత్రమే. అయితే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీకి అత్యంత సన్నిహితుడు.
అంతేకాకుండా గతంలో బిజెపిలోఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. కాగా ప్రభాస్ ని పార్టీ లోనికి తీసుకు వచ్చే బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ బిజెపి లో చేరితే కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాస్ ని నరసాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
అయితే బిజెపి కృష్ణంరాజు కూడా ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చినట్లుగా కూడా సమాచారం. కృష్ణంరాజు అంగీకరిస్తే గవర్నర్ గా పంపడానికి కమలనాధులు సిద్ధమని అంటున్నారు.
దీనిపై సమగ్ర చర్చలకు కృష్ణం రాజును, ప్రభాస్ ను అమిత్షా ఢిల్లీకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
అయితే గతంలో కృష్ణంరాజు చాలాసార్లు ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ఆసక్తి కనబరిచారు అని కూడా అంటున్నారు.
అలాంటి ప్రతిపాదన బిజెపి నుండి వస్తే కృష్ణంరాజు తప్పకుండా అంగీకరించవచ్చు.
బాహుబలి ప్రభాస్ బిజెపి ప్రతిపాదన ఆమోదించకపోతే, బిజెపి ప్రచారానికి ఎలాంటి సహాయ సహకారం అందించకపోతే, కృష్ణం రాజు గవర్నర్ గా నియమించే ప్రతిపాదన బిజెపిలో కొనసాగుతుందా?……… ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.