ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు: తప్పులో కాలేసిన బాబు.. క్లాస్ తీసుకుంటున్న నెటిజన్లు

దేశంలో మూడు అంతర్జాతీయ విమానాశ్రాయలున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. కానీ కేరళలో నాలుగు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులున్నాయి. దీంతో బాబుకు నెటిజన్లు క్లాస్ తీసుకుంటున్నారు.

 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం భోగాపురం విమానాశ్రాయానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తన ఫాలోవర్లతో పంచుకున్నారు. ‘2700 ఎకరాల్లో నిర్మిస్తోన్న ఈ విమానాశ్రయం పూర్తైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధి శరవేగంగా సాధ్యమవుతుంది.
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా భోగాపురం నుంచి వెళ్లే పరిస్థితి వస్తుంద’ని చంద్రబాబు ట్వీట్ చేశారు. అక్కడతో ఆగిపోకుండా మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని బాబు ట్వీట్ చేశారు.

‘పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లోనూ విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. 18 నెలల్లోనే ఓర్వకల్లు విమానాశ్రయం పూర్తి చేశాం. కడప, రాజమండ్రి, విజయవాడ ఎయిర్‌ పోర్టులను అభివృద్ధి చేస్తా’మని చంద్రబాబు ట్వీట్ చేశారు.

మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లోనూ విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. 18 నెలల్లోనే ఓర్వకల్లు విమానాశ్రయం పూర్తి చేశాం. కడప, రాజమండ్రి, విజయవాడ ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తాం.

బాబు ట్వీట్ పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌లు కేంద్రం పరిధిలోకి వస్తాయి. మీరు చేసేది ఏముందని ప్రశ్నిస్తున్నారు. మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ కాదని బాబుకు సూచిస్తున్నారు.

కేరళలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ మూడు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న విషయం తెలీదా అని ప్రశ్నిస్తున్నారు.

కేరళలో గత ఏడాది డిసెంబర్ 9న కన్నూరు ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. అప్పటికే కొచ్చిన్, తిరువనంతపురం, కోజికోడ్‌లలో అంతర్జాతీయ విమానాశ్రాయాలు ఉన్నాయి.

కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభంతో దేశంలో 4 అంతర్జాతీయ విమానాశ్రాయలున్న తొలి రాష్ట్రంగా కేరళ రికార్డులకెక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *