పాక్ చెరకు చిక్కిన అభినందన్ విడుదల.. రేపే

పాక్ చెరకు చిక్కిన అభినందన్ వర్ధమాన్ కథ సుఖాంతం అవుతోంది. అభినందన్ ను విడుదల చేసేందుకు పాక్ సమ్మతించింది.

శాంతి ప్రక్రియలో భాగంగా అభినందన్ ను తాము విడుదల చేయడానికి రెడీగా ఉన్నామని, రేపే ఆ ఇండియన్ పైలెట్ ను విడుదల చేయబోతున్నట్టుగా ఇమ్రాన్  ఖాన్ పాక్ చట్టసభలో ప్రకటించాడు. 

మిగ్ విమానం ఫెయిల్యూర్ తో అభినందన్ ఈ వింగ్ కమాండర్ పాక్ లో దిగిన సంగతి తెలిసిందే. అక్కడ స్థానికులకు చిక్కిన అభినందన్ ను  పాక్ మిలటరీ అదుపులోకి తీసుకుంది.

స్థానికులు అభినందన్ పై దాడికి పాల్పడిన వీడియోలు వైరల్ గా మారాయి.

అయితే అభినందన్ ను తాము బాగా చూసుకుంటున్నట్టుగా ప్రకటించిన పాక్ అందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో అభినందన్ విషయంలో భారత్ నుంచి సానుభూతి వెల్లువెత్తింది. అతడి స్థైర్యానికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి.

అంత వరకూ బాగానే ఉంది కానీ.. అభినందన్ ను పాక్ చిత్ర హింసలు పెడుతుందా? యుద్ధ ఖైదీగా దశాబ్దాల పాటు జైల్లో మగ్గేలా చేస్తుందేమో అనే ఆందోళనలూ వెల్లువెత్తాయి.

వాటన్నింటికీ తెర దించుతూ ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేశాడు. అభినందన్ ను తాము విడుదల చేస్తామని.. రేపు విడుదల అని కూడా ప్రకటించాడు.

తద్వారా తాము శాంతి కోసం పాటు పడుతున్నట్టుగా ఇమ్రాన్ ప్రకటించుకున్నాడు. విడుదల విషయంలో ఇమ్రాన్ ను అభినందించాలి.

కానీ, ఇలాంటి పరిస్తితి తలెత్తడానికి కారణం ఎవరో ఆయనే ఆలోచించుకుంటే.. ఇన్ని సమస్యలు ఉండవేమో! 

ఏదైతేనేం.. భారతీయుల హృదయాల్లో ఆందోళన రేపిన ఒక ఉదంతం సుఖాంతం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *