భారత్ సత్తా చాటుతు ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడుతున్న వైమానిక దళం

pulwama దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది, ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడుతోంది. తెల్లవారుజామున 3.30 గంటలకు ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది.

12 మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్ తొ దాడి చేసింది. భారత్ చేసిన ఈ భీకర ఎటాక్ లో ఉగ్రవాద శిబిరాలు అన్ని నేలమట్టం అయ్యాయి.

సరిహద్దు నియంత్రణ రేఖ LOC వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వెయ్యి కిలోల బాంబులతో దాడి చేసి, మిరేజ్2000 జెట్ ఫైటర్స్ తో సత్తా చాటింది.

మిరేజ్ 2000 ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చo నీయమైన యుద్ధ విమానం, భారత వైమానిక దళానికి చెందిన ఈ విమానం పాక్ ఆక్రమిత కాశ్మీరు ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది.

ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది దీంతో మిరాజ్ 2000 విమానాల గురించి చర్చ మొదలైంది.

మిరేజ్ 2000 యుద్ధ విమానాలు ఇప్పుడే కాదు కార్గిల్ యుద్ధంలో ను భారతదేశానికి కీలకంగా ఉపయోగపడ్డాయి.

కార్గిల్ యుద్ధ సమయంలో కూడా మీ రేజ్ విమానాలు శత్రు స్థావరాలను ధ్వంసం చేసి గర్వంగా తిరిగి వచ్చాయి.

జై ష మహమ్మద్ తీవ్రవాద శిబిరాలు టార్గెట్గా వైమానిక దళం దాడులు చేసింది, మొత్తం 12 యుద్ధ విమానాలతో దాడులు జరిపింది.

భారత్ కార్గిల్ యుద్ధం తరువాత వైమానిక దళం దాడులు చేయడం ఇదే తొలిసారి, మోదీ ఆదేశంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పని పూర్తి చేసింది.

మిరేజ్ 2000 ఇప్పుడు జరుగుతున్న దాడుల్లో మరోమారు సత్తా చాటుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *