పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో

పాక్ కన్నెర్ర.. హఫీజ్ సయీద్ సంస్థలపై నిషేధం
పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది.

ఆ దేశ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బకొడుతోంది. దీంతో దాయాది దేశం భారత్‌ను బుజ్జగించే పనిలో పడింది.

1.పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది.

2. ఆ దేశ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బకొడుతోంది.

3.దీంతో దాయాది దేశం భారత్‌ను బుజ్జగించే పనిలో పడింది.

పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో.. దాయాది ఆర్థిక మూలాలపై కేంద్రం దెబ్బ కొడుతోంది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను భారత్ ఏకాకి చేస్తుండటంతో.. పాకిస్థాన్‌పై రోజురోజుకూ ఒత్తిడి ఎక్కువైంది.

ప్రపంచ దేశాలు కూడా పాక్ ఉగ్రవాదాన్ని వదిలిపెట్టాలని హెచ్చరిస్తున్నాయి. దీంతో ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా సంస్థపై, దాని చారిటీ విభాగం ఫలహ్ ఇ ఇన్‌సానిత్ ఫౌండేషన్‌పై పాకిస్థాన్ నిషేధం విధించింది.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

జమాత్ ఉద్ దవా (జేయూడీ) నెట్‌వర్క్‌లో 300 స్కూళ్లు, హాస్పిటళ్లు, అంబులెన్స్ సర్వీస్ మొదలైనవి ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో 50 వేల మందికిపైగా వలంటీర్లు.. వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు.

జేయూడీని లష్కరే తొయిబాకు ముసుగుగా భావిస్తారు. అమెరికా 2014 జూన్‌లో ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అగ్రరాజ్యం అతడి తలపై భారీ వెలకట్టింది. 2017 నవంబర్లో పాకిస్థాన్ అతణ్ని గృహనిర్బంధం నుంచి వదిలిపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed