పుల్వామా దాడిని ఖండించిన భారత్, పాకిస్థాన్‌పై మండిపాటు!*

పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రదాడిని భారత్ ఖండించింది.పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దని హితవు పలికింది.పాక్ కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని మండి పడింది.

పుల్వామా  భద్రతా దళాలపై ఉగ్రదాడిని భారత్ ఖండించింది. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తోన్న జైషే మహ్మద్ సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై దాడి చేసి 40 మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే.

జైషే మహ్మద్‌పై ఐక్య రాజ్య సమితి, ఇతర ప్రపంచ దేశాలు నిషేధం విధించాయన్న భారత్.. మసూద్ అజహర్ నేతృత్వంలో ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని స్పష్టం చేసింది.

‘ఉగ్ర కార్యకలాపాల నిర్వహణకు అజహర్‌కు పాక్ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాకిస్థాన్ కనుసన్నల్లోనే తమపై దాడులు జరుగుతున్నాయ’ని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది.

దేశ భద్రతకు తగిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని భారత ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగిస్తామన్న భారత్.. ఉగ్రవాదానికి సహకారం నిలిపేయాలని పాక్ ప్రభుత్వానికి సూచించింది.

. పాక్‌లో ఆశ్రయం పొందుతూ ఇతర దేశాలపై దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలను నేలమట్టం చేయాలని డిమాండ్ చేసింది.

మహ్మద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి, పాక్ ఉగ్రవాద సంస్థలపై భద్రతామండలి నిషేధించడానికి వీలుగా అంతర్జాతీయ సమాజం సహకరించాలని భారత్ కోరింది.

ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది.

పుల్వామా దాడిపై చర్చించడానికి కేబినెట్ కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. భారత సైన్యంపై ఉగ్రదాడుల పట్ల పొరుగు దేశం నేపాల్ స్పందించింది. మోదీతో మాట్లాడిన నేపాల్ ప్రధాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *