విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో… నేడు ఆ పథకం ప్రారంభం

ఏపీలో ఆరు జిల్లాలకు శుభవార్త.. నేడు ఆ పథకం ప్రారంభం
ఈ పథకాన్ని మరో ఆరు జిల్లాల్లో అమలు చేయనుంది. విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో అమలులోకి రానుంది. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తోంది జగన్ సర్కార్. పేదవాడికి ముఖ్యమైన వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎన్నో మార్పులు చేసిన ప్రభుత్వం.. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే పథకం వర్తింప చేస్తోంది.
ఈ పథకాన్ని మరో ఆరు జిల్లాల్లో అమలు చేయనుంది. విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో అమలులోకి రానుంది.
గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యశ్రీలో కొన్ని మార్పులు చేశారు. ఈ ఏడాది జనవరిలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తున్నారు.
ఇప్పుడు మరో ఆరు జిల్లాలకు విస్తరించారు. గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో 1,059 జబ్బులకే చికిత్స అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి వ్యాధులను చేర్చింది.
పైలట్ ప్రాజెక్టు అమలు సమయంలో గుర్తించిన అంశాలకు అనుగుణంగా పథకంలో మార్పులు చేశారు.. విధివిధానాలు రూపొందించారు.
రాష్ట్రంలో మిగిలిన ఆరు జిల్లాల్లో కూడా నవంబర్ 14నాటికి విస్తరించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.